Allu Arjun's vanity van photos: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌కి రోడ్డు ప్రమాదం.. ఫోటోలు

Allu Arjun's vanity van meets with accident: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌ని కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Feb 7, 2021, 01:18 AM IST
  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యారావ్యాన్‌కి రోడ్డు ప్రమాదం.
  • Pushpa shooting నుంచి తిరిగి వస్తుండగా ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం.
  • Allu Arjun's vanity van ని వెనుక నుంచి ఢికొన్న లారీ.
Allu Arjun's vanity van photos: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌కి రోడ్డు ప్రమాదం.. ఫోటోలు

Allu Arjun's vanity van meets with accident: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌ని కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం పుష్ప సినిమా షూటింగ్ ముగించుకున్న మూవీ యూనిట్ సభ్యులు హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఖమ్మం సమీపంలో సత్యనారాయణపురం వద్ద అల్లు అర్జున్‌కి చెందిన TS 09 FG 0666 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన Allu Arjun's vanity van రోడ్డు ప్రమాదానికి గురైంది. 

Allu Arjun's vanity van photos

అల్లు అర్జున్ క్యారావ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయగా... ఆ వెనుకే వస్తున్న ఓ టిప్పర్ లారీ క్యారావ్యాన్‌ని ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో Allu Arjun ఆ వ్యాన్‌లో లేకపోవడంతో ఆయనకు ఎటువంటి హానీ జరగలేదు. అదే క్యారా వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆయన మేకప్ టీమ్ కూడా అదృష్టవశాత్తుగా ఎటువంటి గాయాలపాలు కాకుండా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్ వెనుకభాగం పాక్షికంగా దెబ్బతింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Allu Arjun's vanity van Falcon meets with an accident while returning from Pushpa shooting in Rampachodavaram

Also read : Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్..

గతేడాది నవంబర్ నుంచి జనవరి చివరి వరకు రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసినట్టు ఇవాళ మధ్యాహ్నమే పుష్ప మూవీ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. Pushpa shooting సజావుగా సాగేందుకు సహకరించిన అక్కడి Tribals, స్థానిక అధికార యంత్రాంగానికి మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, స్థానిక అధికార యంత్రాంగం సహకారం లేకపోతే ఈ షూటింగ్ సాధ్యపడి ఉండేదే కాదని చెప్పడం ద్వారా నిర్మాతలు వారి పట్ల తమ కృతజ్ఞతభావాన్ని చాటుకున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News