Pushpa movie villain: అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా తమిళ హీరో ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్‌ని పూర్తి చేసినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమాకు అవసరమైన విలన్ మాత్రం ఖరారు కాలేదు.

Last Updated : Dec 25, 2020, 07:58 PM IST
  • పుష్ప సినిమాతో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
  • పుష్ప సినిమా విలన్ కోసం కొనసాగుతున్న వేట.
  • పష్ర మూవీ విలన్ కోసం తమిళ నటుడు పేరును పరిశీలిస్తున్న దర్శకుడు సుకుమార్
Pushpa movie villain: అల్లు అర్జున్ సినిమాలో విలన్‌గా తమిళ హీరో ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన షెడ్యూల్స్‌ని పూర్తి చేసినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమాకు అవసరమైన విలన్ మాత్రం ఖరారు కాలేదు. ఇప్పటికే తమిళ, తెలుగు, హిందీ సినీ పరిశ్రమల నుంచి పలువురు నటుల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి కానీ వాళ్లలో ఎవ్వరూ ఫైనల్ కాలేదు. దీంతో పుష్ప సినిమా విలన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. తమిళ హీరో ఆర్యను పుష్ప సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో గుణశేఖర్ డైరెక్ట్ చేసిన వరుడు చిత్రంలో అల్లు అర్జున్‌కి ( Allu Arjun ) ఆర్య విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా కావడం.. తెలుగు తర్వాత తమిళంలోనే ఎక్కువ మార్కెట్ ఉంటుందనే అంచనాలు వేస్తున్న నేపథ్యంలో తమిళ పరిశ్రమ నుంచే విలన్‌ని ఖరారు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే సుకుమార్ ఇలా ఆర్య పేరును పరిశీలిస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also read : Red movie: సంక్రాంతికి విడుదల కానున్న రెడ్ ..ఇక రామ్ విశ్వరూపమేనట

అయితే, దీనిపై ఇప్పటివరకు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ( Red sandal smuggling ) నేపథ్యంతో తెరకెక్కుతున్న  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన ( Rashmika Mandanna ) జంటగా నటిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News