Anil Ravipudi: మరోసారి దిల్ రాజు దగ్గరికి అనిల్ రావిపూడి.. ఆ సినిమా సీక్వెల్ కోసమా?

Anil Ravipudi with Dil Raju: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన ఎంటర్టైన్మెంట్ తో అలరించాడు. అనిల్ రావిపూడి తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేసాడు. కానీ మధ్యలో సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి సినిమాలు మాత్రం వేరే బ్యానర్ లో చేసాడు. కాగా ఇప్పుడు అనిల్ రావిపూడి తిరిగి మళ్ళి దిల్ రాజు బ్యానర్ లోనే ఒక సినిమా చేయడానికి సిద్ధమైపోయారట.. మర్యాద లేదు ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 01:53 PM IST
Anil Ravipudi: మరోసారి దిల్ రాజు దగ్గరికి అనిల్ రావిపూడి.. ఆ సినిమా సీక్వెల్ కోసమా?

Anil Ravipudi Film with RaviTeja: అనిల్ రావిపూడి ఈ పేరు వింటే మనకి తన కామెడీ టైమింగ్ గుర్తొస్తుంది. కామెడీ లో తనదైన శైలి కనబరుస్తూ ఇప్పటి వరకు హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. కాగా అనిల్ రావిపూడి ఇటివలే బాలకృష్ణ తో తెరకెక్కించిన భగవంత్ కేసరి లో మాత్రం కామెడీ కంటే కూడా ఎమోషన్ ని యాక్షన్ ని నమ్ముకొని తీసాడు. దసరా సంధర్బంగా రిలీజ్ అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు అనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే దీనికి సమాధానంగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ని దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చి హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరో సారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఓసినిమా రాబోతుంది అనగానే అందరిట్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది.

అనిల్ రావిపూడి కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా అనగానే తన దగ్గర ఉన్న రాజా ది గ్రేట్ సీక్వెల్ కథని తీసే ఆలోచనలో ఉన్నాడట. రవితేజ గుడ్డివాడిగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇదే సినిమాకి అనిల్ రావిపూడి కథ తాయారు చేసి దిల్ రాజుకి వినిపించే పనిలో ఉన్నాడు. అన్ని అనుకునట్టు జరిగితే అతి త్వరలోనే వీరి ముగ్గురు కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటిదాకా అనిల్ రావిపూడి కి డిజాస్టర్ అయితే లేదు. రాజమౌళి తర్వాత ఒకరకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు ఫ్లాప్ చూడని దర్శకుడు అనిల్ మాత్రమే. అతని f3 సినిమా కొంచెం యవరేజ్ గా ఆడగా మిగతా సినిమాలన్నీ మాత్రం మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. కాగా ఇప్పుడు రాజా ది గ్రేట్ సీక్వెల్ తో అనిల్ మరో సూపర్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News