Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

Delhi Air Pollution: ప్రాణాంతకమైన కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. వరుణుడు కరుణించడంతో కాలుష్యం కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 11, 2023, 11:13 AM IST
Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీవాసులకు కాస్త ఉపశమనం కల్గిందిం. గత కొద్దిరోజులుగా తీవ్రమైన కాలుష్యంతో పడుతున్న ఇబ్బంది నుంచి ఆ ప్రకృతే రిలీఫ్ ఇచ్చింది. కాలుష్యం నుంచి తక్షణ నియంత్రణకై కృత్రిమ వర్షాలకు యోచిస్తున్న తరుణంగా వరుణ దేవుడు కరుణించాడు. సహజ వర్షాలు నమోదయ్యాయి. 

దేశ రాజధాని డిల్లీలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతోంది. శ్వాస సంబంధ, చర్మ సమస్యలు తలెత్తతున్నాయి. దీనికితోడు వాహన కాలుష్యం, పొగమంచు ఉండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ప్రతియేటా డిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్యం తీవ్రమౌతూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, యూపీల్లో లక్షలాది ఎకరాల్లోని పంట వ్యర్ధాల్ని రైతులు యధేచ్ఛగా తగలబెడుతుండటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమౌతున్నా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంగా గాలి నాణ్యత పెంచేందుకు, కాలుష్యం నియంత్రించేందుకు ఢిల్లీలో గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. 

మరోవైపు ఢిల్లీలో కాలుష్యాన్ని తక్షణం నియంత్రించేందుకు కృత్రిమ వర్షాలు సరైన పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి కృత్రిమ వర్షాలు ప్రయోగం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ తరుణంలో ప్రకృతి కరుణించింది. కృత్రిమ వర్షాల అవసరం లేకుండా సహజవర్షం పడింది. దాంతో కాలుష్యంతో సతమతమౌతున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట కల్గింది. గాలి నాణ్యత కాస్త మెరుగుపడింది. 

అంతకు ముందు ఢిల్లీలో గాలి నాణ్యత 437 ఉంటే వర్షం తరువాత 408కు తగ్గిపోయింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత 339కు చేరుకుంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దీపావళి రోజుల్లో మరింత పెరగవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమౌతోంది. 

Also read: Terror Threat: అయోధ్య రామాలయానికి ఉగ్రదాడి ముప్పు, ఆలయం చుట్టూ సాయుధ దళాల మొహరింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News