Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్

Noel Supports Lasya | అనారోగ్య సమస్యలతో తప్పుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు వెళుతున్నానని, ఈ కొన్ని రోజుల గురించి చూసుకుని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టలేనని స్టేజీ మీదకు వచ్చిన సందర్భంగా సింగర్ నోయల్ అభిప్రాయపడ్డాడు. 

Last Updated : Nov 1, 2020, 01:19 PM IST
Bigg Boss Telugu 4: ఆ ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్స్: నోయల్

బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ నోయల్ వైదొలిగాడు. అనారోగ్య సమస్యలతో తప్పుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss 4 Telugu) హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు బిగ్‌బాస్ 4 నుంచి బయటకు వెళుతున్నానని, ఈ కొన్ని రోజుల గురించి చూసుకుని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టలేనని స్టేజీ మీదకు వచ్చిన సందర్భంగా సింగర్ నోయల్ అభిప్రాయపడ్డాడు.

 

వెళుతూ వెళుతూ తోటి కంటెస్టెంట్స్ అవినాష్, అమ్మ రాజశేఖర్‌లకు గట్టిగానే ఇచ్చుకున్నాడు నోయల్. ఇంట్లో ఎంతో ప్రశాంతంగా కనిపించే నోయల్‌లో ఇంత బాధ దాగుందా అని ప్రేక్షకులతో పాటు మిగతా కంటెస్టెంట్స్ గుర్తించేలా చేసి వెళ్లిపోయాడు. నోయల్ ఎలిమినేట్ అవుతున్నాడని తెలియగానే దేత్తడి హారిక, అభిజిత్, లాస్య  కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్‌బాస్ ఇంటికి రాకముందే లాస్య తనకు తెలుసుకుని, నీ కింద ఉన్నవాళ్లు నిన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వాళ్లు నీ కన్నా కిందనే ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని సూచించాడు. హారిక, అభిజిత్‌లను గేమ్ బాగా ఆడాలని ప్రోత్సహించాడు.

 

బిగ్‌బాస్ 4 తెలుగు షోలో  అభిజిత్, హారిక, లాస్య తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని నోయల్ తెలిపాడు. వీరిని టాప్ 5లో తాను చూడాలనుకున్నాని తన మనసులో మాట బయటపెట్టాడు. వీరిలో ఒకరు బిగ్‌బాస్ తెలుగు 4 విజేతగా నిలిస్తే సంతోషిస్తానని, ఇంటికి వెళ్లినా మీ ఆట కచ్చితంగా చూస్తానని వాళ్లకు ధైర్యం చెప్పాడు. ఈ ముగ్గురు స్నేహితులను ఫైనల్‌కు చేర్చడం తన పనికి పెట్టుకుంటానని వారి కోసం కష్టపడతానని, అండగా నిలుస్తానని నోయల్ హామీ ఇచ్చేశాడు. 

 

అభిజిత్‌కు ట్రిమ్మర్ పంపిస్తానని నోయల్ చెప్పగా.. లేదు బ్రో.. బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి బయటకు వెళ్లేంతవరకు తాను హెయిర్ కట్ చేసుకోనని అభిజిత్ శపథం చేశాడు. వెళ్లిపోతున్నందుకు బాధగా ఉన్న తనకు తప్పడం లేదని నోయల్ చివరి మాట చెప్పేసి బిగ్‌బాస్ 4 నుంచి నిష్క్రమించాడు.

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News