Sound Party: 'సౌండ్‌ పార్టీ' ట్రైలర్‌లో ప్రతీ పంచ్‌కు నవ్వులే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి

Sound Party Movie Pre Release Event: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్స్‌గా నటించిన సౌండ్ పార్టీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 07:37 PM IST
Sound Party: 'సౌండ్‌ పార్టీ' ట్రైలర్‌లో ప్రతీ పంచ్‌కు నవ్వులే.. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి

Sound Party Movie Pre Release Event: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా సంజ‌య్ శేరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్షన్స్ ప‌తాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్‌ అవ్వగా.. ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సెన్సార్స్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 24న గ్రాండ్‌ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌గా భారీగా నిర్వహించారు. 

ఈ ఈవెంట్‌కు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌండ్ పార్టీ సినిమాకు సంబంధించి బిట్ కాయిన్‌ను ఆయన ఆవిష్కరించారు. బిగ్ బాస్ షో నుంచి వచ్చినప్పటి నుంచి సన్నీ బాగా కష్టపడుతున్నాడని అనిల్ రావిపూడి అన్నారు. మంచి మంచి సినిమాలు చేస్తున్నాడని.. ఈ మూవీ సక్సెస్ సాధించి కెరీర్‌లో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ట్రైలర్ చాలా బాగుందని.. ప్రతి పంచ్‌కి నవ్వులేనని అన్నారు. ఇటీవల ఇంత  హిలేరియస్‌గా చూసిన ట్రైలర్ ఇదేనని చెప్పారు. ట్రైలర్‌ను చూస్తే.. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ బాగా పండుతాయని అర్థమవుతుంతోందన్నారు. సినిమా సక్సెస్ సాధించి నిర్మాతలు మరింత సౌండ్ పార్టీగా మారాలని ఆకాక్షించారు. సన్నీ వెరీ టాలెంటెడ్ హీరో అని.. ఈ సినిమా విజయం సాధించి మరింత మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ తెలిపారు. నేచురల్ స్టార్ నాని, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హైపర్ ఆది వీడియో బైట్స్ ద్వారా చిత్రబృందానికి విషెస్ చెప్పారు. 

హీరో వీజే సన్నీ మాట్లాడుతూ తాను యాక్టర్ కావాలని కలగనే మా అమ్మ కళావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంచి స్టార్ కాస్ట్‌తో ఈ మూవీని రూపొందించామని.. హీరోయిన్ హ్రితిక చాలా సపోర్ట్ చేసిందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తనకు ఒక బ్యూటీఫుల్ డాడీని శివన్నారాయణ రూపంలో ఇచ్చారని అన్నారు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుందన్నారు. కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌గా మూవీలో ఆడియన్స్‌ను అలరిస్తామన్నారు. సినిమాకు మోహిత్ సూపర్ మ్యూజిక్ అందించాడని.. మంచి టీమ్ కుదిరిందని తెలిపారు. డైరెక్టర్ సంజయ్ వెరీ టాలెంటెడ్ అని.. భవిష్యత్తులో తన పేరు ఒక బ్రాండ్‌గా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం కల్పించినందుకు హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాతలు రవి పొలిశెట్టి, మహేంద్ర తెలిపారు. ఈ నెల 24న ప్రతీ ఒక్కరు థియేటర్‌లలో చూసి.. సినిమాకు మంచి అందివ్వాలని కోరారు. ఈ సినిమా సెన్సార్ చూసిన అధికారులు.. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఎంజాయ్ చేశామని చెప్పారని అన్నారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందన్నారు. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా ఆడియన్స్‌ను అలరిస్తాయన్నారు. అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

Also Read:  Vivo V29E 5G Price: అదిరిపోయే కెమెరా కలిగిన Vivo V29e 5G మొబైల్ ఇప్పుడు కేవలం రూ. 6,099కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News