Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Oneplus 12 Launch: అతి తక్కువ ధరలోని త్వరలోనే వన్ ప్లస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ వన్ ప్లస్ 12 పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 01:14 PM IST
Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

Oneplus 12 Launch: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు ప్రీమియం ఫీచర్స్ కరిగిన మొబైల్స్ నే ఎక్కువగా విక్రయిస్తున్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మల్టీ నేషనల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ అతి త్వరలోనే ప్రీమియం సెగ్మెంట్లో మరో మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మొబైల్ ఫోన్ వన్ ప్లస్ ఇంతకు ముందు విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కంటే తక్కువ ధరలోనే లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పేరేంటో, విడుదల తేదీ, ఫీచర్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ మల్టీ నేషనల్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ అతి త్వరలోనే విడుదల చేయబోయే OnePlus 12 పేరుతో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ కంపెనీ డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కంపెనీ OnePlus 12 తో పాటు OnePlus Ace 3ని కూడా కస్టమర్స్ కి పరిచయం చేయబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ రెండు స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కంపెనీ ఇయర్ బడ్స్ తో పాటు టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్ లను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Read:Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

OnePlus 12 స్పెసిఫికేషన్లు:
త్వరలో విడుదల కాబోయే వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Xiaomi 14 సిరీస్, iQOO 12 లైనప్ లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 12 Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్ తయారీలో కంపెనీ ఆప్టిమైజేషన్‌తో LYT-T808 సెన్సార్ ను వినియోగించింది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ లో  48 మెగాపిక్సెల్ IMX581 అల్ట్రా-వైడ్ లెన్స్ తోపాటు 3x ఆప్టికల్ జూమ్‌తో 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV64B పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ OnePlus 12 స్మార్ట్ ఫోన్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 6.82-అంగుళాల BOE X1 OLED డిస్‌ప్లేతో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే 2K రిజల్యూషన్ తోపాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన ఆండ్రాయిడ్ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14లో రన్ అవుతుందని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ 1TB UFS 4.0 స్టోరేజ్‌, 5400mAh బ్యాటరీ సపోర్టుతో రాబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

Read:Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News