కొరటాల శివ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్స్ ?

రెండు విభిన్నమైన పాత్రల్లో మెగాస్టార్ ?

Last Updated : Jun 5, 2018, 06:31 PM IST
కొరటాల శివ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్స్ ?

ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా వున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ-చిరంజీవి కాంబోపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త వార్త వెలుగులోకొచ్చింది. టాలీవుడ్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాలో చిరు రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒకటి విదేశాల్లో వ్యాపారం చేసుకునే ఎన్నారై బిలియనీర్ పాత్ర కాగా మరొకటి ఊరిలో వ్యవసాయం చేసుకునే రైతు పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఇందులో వాస్తవం ఎంతుంది అనే సంగతి తెలిసే అవకాశం లేదు. 

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న సైరా సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో షూటింగ్ జరుపుకుంటోంది. సైరా సినిమా కోసం ఇక్కడ ప్రత్యేకంగా సెట్ రూపొందించారు. ఇటీవల షూటింగ్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ మళ్లీ ఈమధ్యే రెగ్యులర్ షూట్‌కి హాజరవుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన నయనతార జంటగా నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 

Trending News