Devara Fear Song Promo: భయపెట్టడానికి ఎన్టీఆర్ సిద్ధం.. అదరగొట్టిన ఫియర్ సాంగ్ ప్రోమో..

Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.  ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ ప్రోమో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 17, 2024, 05:43 PM IST
Devara Fear Song Promo: భయపెట్టడానికి ఎన్టీఆర్ సిద్ధం.. అదరగొట్టిన ఫియర్ సాంగ్ ప్రోమో..

Devara First Lyrical: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పైకి ఎగిసింది. అయితే ఈ సినిమా తరువాత ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ చిత్రం రాలేదు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా దేవర పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో.. తెలుగు అభిమానుల్లో ఈ చిత్రంపై ఆశలు మరింతపెరిగాయి.

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో.. ఆ రోజు ఒక అప్డేట్ విడుదల చేయనుందామని సినిమా యూనిట్ తెలియచేశారు. అయితే ఆరోజు విడుదల చేయబోయే అప్డేట్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ అని కూడా ఈ మధ్యనే ప్రకటించారు ఈ చిత్ర మేకర్స్. ఇందుకోసమే ఈరోజు ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. ఫియర్ సాంగ్ ప్రోమో అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఉందే చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ లిరికల్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కన్నా ముందు రోజే అనగా మే 19న విడుదల కానుంది. అంటే ఎన్టీఆర్ అభిమానులకు ఆయన పుట్టినరోజు సంబరాలు ఒక రోజు ముందు నుంచే మొదలుకానున్నాయి.

కాగా ఈ గ్లిమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా కనిపించి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. ఈ పాట పై అంచనాలను మరింత పెంచేశారు. మే 19 విడుదలయ్యే ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రోమోలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉండడంతో…ఈ సినిమా ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుందో అని అభిమానులు తెగ ఖుషి ఫీల్ అవుతున్నారు. కాగా ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 10వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News