Movies Releasing this week: పొన్నియన్ సెల్వన్ సహా థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఇదే!

List Of Movies Releasing in Theatres and OTT this week: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల మీద ఒక లుక్కు వేద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 30, 2022, 05:44 AM IST
  • థియేటర్లో సందడి చేయనున్న పొన్నియన్ సెల్వన్
  • ఓటీటీలో పెద్ద ఎత్తున సినిమాలు
  • ఆ లిస్టు మీ కోసం
Movies Releasing this week: పొన్నియన్ సెల్వన్ సహా థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఇదే!

List Of Movies Releasing in Theatres and OTT this week: సెప్టెంబర్ నెలలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కేవలం బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం సినిమాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. మిగతా అన్ని సినిమాలు కూడా దాదాపుగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. నిజానికి సెప్టెంబర్ నెలలో బ్రహ్మాస్త్ర తప్ప మరో పెద్ద సినిమా ఏదీ విడుదల కాలేదు. కానీ చిన్న సినిమాలు పెద్ద ఎత్తున విడుదలయ్యాయి.

అయితే ఎన్ని సినిమాలు విడుదలైనా ఒక్కదానికి కూడా పెద్దగా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడలేదు. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు పొన్నియన్ సెల్వన్ సినిమా వస్తోంది. ఈ సినిమా తప్ప మరే సినిమాకి ఈ వారంలో ఎలాంటి బజ్ లేదు. ఇప్పటికే ధనుష్ హీరోగా వస్తున్న నేనే వస్తున్నా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈరోజు అంటే సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఓటీటీలో ఏఏ సినిమాలు అందుబాటులో ఉన్నాయనే విషయం మీద ఒక లుక్కు చేద్దాం పదండి.  

నివేదా థామస్, రెజీనా కీలక పాత్రలలో నటించిన శాకినీ డాకిని సినిమాను సుధీర్ వర్మ డైరెక్టర్ చేయగా సునీత తాటి నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్ సహ నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.. తీర్ పు అనే మలయాళం మూవీ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఆర్య హీరోగా నటించిన కెప్టెన్ మూవీ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తమన్నా కీలకపాత్రలో నటించిన ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమా 30వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా సినిమా సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లాండే ఒక హాలీవుడ్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా ఒక కుక్క ప్రధాన భూమిక పోషించిన 777 చార్లీ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.

బుల్లెట్ ట్రైన్ అనే హాలీవుడ్ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమ్ అవుతోంది. కర్మయుద్ధ అనే ఒక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హాకస్ ఫాక్స్ అనే ఒక హాలీవుడ్ ఫిలిం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి డిస్నీ +హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రేయికి వేయికళ్ళు అనే సినిమా ఆహాలో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వైష్ణవ్  తేదీ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా అక్టోబర్ రెండో తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Also Read: Lunch Menu Viral: వేల కిలోల మటన్, చికెన్, రొయ్యలు, చేపలు..కృష్ణంరాజు సంస్మరణ సభలో కళ్లు చెదిరే వంటకాలు!

Also Read: Bellamkonda Ganesh's Swathimuthyam: 'స్వాతి ముత్యం' మీద అంత నమ్మకమా.. ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీ.. ఇప్పుడు మరో సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News