Director Ajay Bhupathi says Sorry: క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌ భూపతి

Ajay Bhupathi says Sorry : డైరెక్టర్ అజయ్ భూపతి కూడా 'మహా సముద్రం' సినిమా అందరికీ నచ్చుతుందని, మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందు చెప్పారు. కానీ మహా సముద్రం మూవీ రిలీజ్‌ అయ్యాక అందరి ఆశలను ఆవిరి చేసింది.

Last Updated : Oct 29, 2021, 12:46 PM IST
  • సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు
    చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి
  • మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి అని కోరిన మహా సముద్రం దర్శకుడు
Director Ajay Bhupathi says Sorry: క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌ భూపతి

Maha Samudram Movie Director Ajay Bhupathi says Sorry for not reaching the expectations: డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో హిట్ అందుకున్న ఆయన.. తర్వాత శర్వానంద్ - సిద్దార్థ్‌లతో 'మహా సముద్రం' (Maha Samudram) తీశాడు. ప్రేమ, స్నేహాం, వైరం వంటి సున్నితమైన అంశాలతో సిద్ధమైన ఈ కథ అజయ్‌ భూపతి (Ajay Bhupathi) కలల ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. పోస్టర్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌తో సినిమాపై మొదట మంచి హైప్ క్రియేట్ అయింది. 

డైరెక్టర్ అజయ్ భూపతి కూడా 'మహా సముద్రం' (Maha Samudram) సినిమా అందరికీ నచ్చుతుందని, మూవీ పెద్ద హిట్ అవుతుందంటూ రిలీజ్‌కు ముందు చెప్పారు. కానీ మహా సముద్రం మూవీ రిలీజ్‌ అయ్యాక అందరి ఆశలను ఆవిరి చేసింది. దాంతో సోషల్ మీడియా వేదికగా అజయ్ భూపతిని (Ajay Bhupathi) కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. దాంతో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు క్షమించండి అని కోరారు. ఈసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తాను అని పేర్కొన్నారు.

Also Read : Petrol Price today: వరుసగా మూడో రోజూ పెట్రో బాదుడు- కొత్త రికార్డు స్థాయికి ధరలు

ఇక ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్‌, ఆదితి రావు హైదరీ (Aditi Rao Hydari) కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మాం సుంకర 'మహా సముద్రం' (Maha Samudram) మూవీ నిర్మించారు.

Laxmi devi puja: లక్ష్మీదేవికి శుక్రవారమే ఎందుకిష్టం? Friday నాడే లక్ష్మీ పూజ ఎందుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News