Maha Samudram trailer: ప్రభాస్ మెచ్చిన మహా సముద్రం ట్రైలర్

Maha Samudram trailer: మహా సముద్రం ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండు రోజుల క్రితం రిలీజైన మహా సముద్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావ్ హైదరి, అను ఎమాన్యుయెల్, జగపతి బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను Rx100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు (Ajay Bhupathi).

Written by - Pavan | Last Updated : Sep 25, 2021, 05:31 PM IST
Maha Samudram trailer: ప్రభాస్ మెచ్చిన మహా సముద్రం ట్రైలర్

Maha Samudram trailer: మహా సముద్రం ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండు రోజుల క్రితం రిలీజైన మహా సముద్రం ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావ్ హైదరి, అను ఎమాన్యుయెల్, జగపతి బాబు, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను Rx100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేశాడు (Ajay Bhupathi). ఇప్పటికే యూట్యూబ్‌లో 6.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న మహా సముద్రం ట్రైలర్.. మూవీపై అంచనాలు పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. 

మహా సముద్రం ట్రైలర్‌ను చూసి తాజాగా బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా ఫ్లాట్ అయ్యాడు. మహా సముద్రం మూవీ ట్రైలర్ బాగుందని కితాబిస్తూ ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో మహా సముద్రం మూవీ (Maha Samudram movie) యూనిట్ కూడా ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో ట్వీట్ చేసింది. ఎందుకంటే.. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ట్రైలర్‌కి కితాబిస్తే.. ఏ సినిమాకైనా అంతకంటే పెద్ద బూస్టింగ్ ఇంకేం ఉంటుంది చెప్పండి.

Also read : Varudu Kaavalenu: దసరా బరిలో వరుడు కావలెను... రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ చేసిన ట్వీట్ (Prabhas) చూశారు సరే. మరి మహా సముద్రం ట్రైలర్ చూశారా ? చూడకపోతే ఇంకెందుకు ఆలస్యం ? మహా సముద్రం ట్రైలర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Also read : Love Story Movie : సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న లవ్‌స్టోరి మూవీ.. ఒక్కరోజులోనే అన్ని కోట్లు వసూలు చేసిందట

మహా సముద్రం ట్రైలర్ (Maha Samudram trailer) చూశారు కదా! నిజంగానే ఆ మహా సముద్రం ఎలాగైతే ఎన్నో విషయాలను తనలో దాచుకుంటుందో.. అలాగే సముద్రమంత ప్రేమని, ఎమోషన్స్‌ని, సీక్రెట్స్‌ని ఈ మహా సముద్రం మూవీ తనలో దాచుకున్నట్టుంది కదూ!! ఆ ఎమోషన్స్ ఏంటి ? సీక్రెట్స్ ఏంటి ? అసలు ఏంటి ఈ రివేంజ్ డ్రామా అనే విషయం తెలియాలంటే.. అక్టోబర్ 14 వరకు వేచిచూడాల్సిందే.

Also read : Anubhavinchu Raja: జల్సా రాయుడిగా 'రాజ్ తరుణ్'...ఆకట్టుకుంటున్న 'అనుభవించు రాజా' టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News