Mahesh Babu: 'ఏజెంట్' టీజర్ పై మహేష్ ప్రసంశ.. సినిమా కోసం ఎదురు చూస్తున్నానంటూ కామెంట్!

 Mahesh Babu praises Agent movie teaser:  ఏజెంట్ సినిమా టీజర్ ని చూసిన మహేష్ బాబు ఆ సినిమా టీజర్ నచ్చడంతో వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 12:25 PM IST
  • అఖిల్ హీరోగా ఏజెంట్

    టీజర్ రిలీజ్ తో పెరుగుతున్న అంచనాలు

    వెయిటింగ్ అంటూ మహేష్ కామెంట్

Mahesh Babu: 'ఏజెంట్' టీజర్ పై మహేష్ ప్రసంశ.. సినిమా కోసం ఎదురు చూస్తున్నానంటూ కామెంట్!

Mahesh Babu praises Agent movie teaser: సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలు కాకుండా వేరే వారి సినిమాలు చూసినా పుస్తకాలు లాంటివి చదివినా ఆయన చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు. అవి తనను ఎగ్జయిట్ చేసినప్పుడు ఆయన ఎగ్జయిట్ మెంట్‌ను ఏమాత్రం ఆపుకోరు. తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే అఖిల్ హీరోగా తాజాగా రూపొందిన ఏజెంట్ సినిమా టీజర్ ని కూడా చూసిన మహేష్ బాబు ఆ సినిమా టీజర్ నచ్చడంతో వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉందని చెబుతూనే చాలా స్టన్నింగ్ అనిపించిందని, అఖిల్ మేకవర్ బాగుందని పేర్కొన్నారు. అంతేకాక సినిమా టీజర్ లోని విజువల్స్ థీమ్ కూడా ఆసక్తికరంగా ఉందని చెబుతూ మమ్ముట్టికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకరలకు కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా టీజర్ బాగుందని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇక అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్నారు అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలవుతోంది.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ ఈ సినిమాతో దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ ఏజెంట్ టీజర్ తో మాత్రం ప్రేక్షకులు అందరితో పాటు సెలబ్రిటీలను కూడా మైమరిపించిన అఖిల్ సినిమాతో ఏ మేరకు మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

Read Also:  KGF 2: మొట్టమొదటి సినిమాగా సరికొత్త రికార్డు.. అన్ని బాషలలో కలిపి అదిరేలా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News