Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

Major Movie Rare feet on Netflix: తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన మేజర్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా మేజర్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 01:20 PM IST
  • అడివి శేష్ హీరోగా మేజర్
  • థియేటర్లలో సూపర్ హిట్ గా మేజర్
  • నెట్ ఫ్లిక్స్ లో కూడా రేర్ ఫీట్
Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

Major Movie Rare feet on Netflix: దేశభక్తి ప్రధానంగా రూపొందిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. తాజాగా అదే కోవలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా మేజర్. అడవి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్ తిక్క ఈ సినిమాను తెరకెక్కించారు. ఘట్టమనేని మహేష్ బాబుకు చెందిన జీఎంబి ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషలలో జూన్ మూడో తేదీన గ్రాండ్గా విడుదల చేశారు.

26/11 ముంబై ఎటాక్స్ సమయంలో టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడుతూ కన్నుమూసిన కేరళ రాష్ట్రానికి చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయింది, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలో కనిపించి కంట తడి పెట్టించారు.  ఈ సినిమాలో శోభిత ధూళిపాళ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే థియేటర్లలో విడుదలై ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా మేజర్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమా మొత్తం 14 దేశాలలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ లో చోటు సంపాదించగా ఇండియా సహా మరికొన్ని దేశాల్లో టాప్ వన్ మూవీ ట్రెండింగ్ లో నిలించింది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించిన దాని మేరకు ఈ సినిమా బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, కువైట్‌, మలేషియా, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సింగపూర్‌, శ్రీలంక, యూఏఈ వంటి 14 దేశాల్లో నెట్‌ ఫ్లిక్స్‌ టాప్‌-10 ట్రెండింగ్ మూవీగా నిలవగా భారత్ మొదలు మారిషస్‌ అలాగే నైజీరియా దేశాల్లో టాప్‌-1లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఎవరితో అయితే పోరాడుతూ సందీప్ ఉన్ని కృష్ణన్ అసువులు భాశాడో ఆ దేశానికి సంబంధించిన వారు కూడా ఈ సినిమాను విపరీతంగా వీక్షిస్తూ ఉండడంతో ఆ దేశంలో కూడా టాప్ టెన్ లిస్టులో నిలబడింది మేజర్ సినిమా.

Also Read: Laal Singh Chaddha: టాలీవుడ్ స్టార్స్ తో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ.. ఏడ్చేసిన అమీర్ ఖాన్! వీడియో వైరల్

Also Read: Krithi Shetty: చీరకట్టులో కవ్విస్తున్న బేబమ్మ.. చిన్నపిల్లను కాదంటోందే!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌ స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News