Master movie leaked: మాస్టర్ నిర్మాతలకు కోలుకోలేని షాక్

Master movie piracy: విజయ్ ఇళయదళపతి నటించిన మాస్టర్ మూవీ జనవరి 13న.. అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ కెరీర్లో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా మాస్టర్ తెలుగు వెర్షన్ కూడా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతోంది. ప్రీ బుకింగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి.

Last Updated : Jan 12, 2021, 06:36 PM IST
Master movie leaked: మాస్టర్ నిర్మాతలకు కోలుకోలేని షాక్

Master movie piracy: విజయ్ ఇళయదళపతి నటించిన మాస్టర్ మూవీ జనవరి 13న.. అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ కెరీర్లో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా మాస్టర్ తెలుగు వెర్షన్ కూడా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతోంది. ప్రీ బుకింగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇదిలావుండగా ఇంకొన్ని గంటలయితే మాస్టర్ సినిమా విడుదల అవుతుందనగా ఆ చిత్ర నిర్మాతలకు కోలుకోలేని షాక్ తగిలింది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు మాస్టర్ మూవీ ఇంటర్నెట్‌లో లీక్ అవడం, సోషల్ మీడియాలో ఆ చిత్రానికి సంబంధించిన పలు దృశ్యాలు వైరల్ అవుతుండటం మాస్టర్ మూవీ యూనిట్‌కి భారీ షాక్ ఇచ్చింది. 

వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న మాస్టర్ మూవీ వీడియో క్లిప్స్‌ని షేర్ చేసుకోవద్దని వేడుకుంటూ మాస్టర్ చిత్ర నిర్మాతలు, దర్శకుడు లోకేష్ కనగరాజ్, హీరోయిన్ మాళివక మోహనన్, తదితరులు ఆడియెన్స్‌కి, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. లీక్ అయిన క్లిప్స్ వైరల్ అవకుండా పైరసిని అడ్డుకునేందుకు మాస్టర్ చిత్ర బృందం అన్ని చర్యలు తీసుకుంటోంది. 

Also read : Master Telugu movie: విడుదలకు ముందే మాస్టర్ దూకుడు

లీక్ అయిన మాస్టర్ మూవీ క్లిప్‌లను ( Master movie clips leaked ) ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని, సినిమాను కాపాడాలని మొత్తం కోలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) విలన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Also read : Master movie: హీరో విజయ్‌కి, తమిళ సర్కార్‌కి కేంద్రం ఊహించని షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News