Megastar Chiranjeevi 154 for Sankranthi: మేనల్లుడికి పోటీగా చిరంజీవి..

Megastar Chiranjeevi vs Panja Vaishnav Tej: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.  సొంతం మేనల్లుడి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సినిమా పోటీ వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 07:00 PM IST
Megastar Chiranjeevi 154 for Sankranthi: మేనల్లుడికి పోటీగా చిరంజీవి..

Megastar Chiranjeevi 154 for Sankranthi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జికె మోహన్ సహ నిర్మాత. చిరంజీవికి పలు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక సినీ రంగంలో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ప్రకటిస్తూ ముందుకు వెళుతున్నారు. 

అందులో భాగంగానే ఇప్పటికే ఖైదీ నెంబర్ 150, సైరా, ఆచార్య వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న మరిన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ వంటి సినిమాలు చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో మెగా 154 అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటివరకు దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు. 

అయితే అనూహ్యంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు జూన్ 24వ తేదీన ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది సినీ యూనిట్. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిన్న మేనల్లుడు సాయిధరమ్ తేజ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రం కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. సొంతం మేనల్లుడి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సినిమా పోటీ వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇక వీరిద్దరి సినిమాలు కాకుండా ప్రభాస్ హీరోగా రాముడి పాత్రలో నటిస్తున్న ఆది పురుష్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదల తేదీని ప్రకటించలేదు కానీ సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అలాగే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడు అనే ద్విభాషా చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ సినిమాని కూడా సంక్రాంతికి తీసుకువస్తారని ప్రచారం జరిగింది కానీ దిల్ రాజు వారసుడు సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా సంక్రాంతికి డౌట్ అనే చెప్పాలి.
Also Read: Karthikeya 2 Trailer: అసలు కృష్ణుడు ఏంటి.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌

Also Read: Suriya - Jyothika : పుత్రికోత్సాహంలో సూర్య.. పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News