Karthikeya 2 Trailer: అసలు కృష్ణుడు ఏంటి.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌

Nikhil's Karthikeya 2 movie Trailer released. జులై 22న కార్తికేయ 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ మొదటి ట్రైలర్‌లను వదిలింది. 

Written by - P Sampath Kumar | Last Updated : Jun 24, 2022, 06:56 PM IST
  • అసలు కృష్ణుడు ఏంటి
  • ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి
  • ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌
Karthikeya 2 Trailer: అసలు కృష్ణుడు ఏంటి.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌

Nikhil's Karthikeya 2 movie Trailer released: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'కార్తికేయ 2'. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, పరిచయ ఇమేజ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 22న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ మొదటి ట్రైలర్‌లను వదిలింది. 

హైదరాబాద్ నగరంలోని ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర బృందం కార్తికేయ 2 తొలి ట్రైలర్‌ను ఆవిష్కరించింది. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివిగల ఈ వీడియో.. 'శాంతను.. ఇది నువ్ ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే. ఆజ్యం మళ్లీ అక్కడ మళ్లీ మొదలైంది' అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభం అయింది. 'అసలు కృష్ణుడు ఏంటి?.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?', 'విశ్వం ఒక పూసల దండ, ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

సముద్రంలోని ద్వారకా నగరం వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్‌లో చూస్తే అర్థమైంది. డైరెక్టర్‌ చందు మెుండేటి శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. ఇది మొదటి ట్రైలర్‌ కాగా.. రెండోదాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. రెండో ట్రైలర్‌ మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News