Megastar Chiranjeevi: ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ చిల్ మోడ్

Megastar Chiranjeevi Family Trip: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. గాడ్‌ఫాదర్ మూవీ హిట్ ఇచ్చిన కిక్‌తో ఆయన ఫుల్‌ జోష్‌గా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 02:59 PM IST
  • ఫ్యామిలీతో మెగాస్టార్ ట్రిప్
  • శృతి హాసన్‌తో వీరయ్య యాత్ర
  • ఫొటోలను షేర్ చేసిన మెగాస్టార్
Megastar Chiranjeevi: ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర.. మెగాస్టార్ చిల్ మోడ్

Megastar Chiranjeevi Family Trip: గాడ్‌ ఫాదర్ సూపర్ హిట్‌తో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ జోష్‌లోకి వచ్చారు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తరువాత రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఊపులో చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్‌లో హుషారుగా పాల్గొంటున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ కమల్ డాటర్ శృతి హాసన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా.. జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. 

ఈ మూవీ షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో చిరంజీవి హాలీ డే ట్రిప్‌కు వెళ్లినట్లు ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు సబంధించిన పిక్‌ను ఆయన షేర్ చేశారు. అదేవిధంగా షూటింగ్‌ కోసం శృతిహాసన్‌తో కలిసి వెళుతున్న పిక్‌ను పంచుకున్నారు. 'ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..' అంటూ మెగాస్టార్ క్యాప్షన్ ఇచ్చారు.

 

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనన్‌గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మాహారాజా రవితేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్‌ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక  బాస్ పార్టీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఇటీవలె రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తూ.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సందడి చేయనున్నాడని అప్‌డేట్ ఇచ్చారు. 
 
మరోవైపు ఈ సంక్రాంతి బాక్సాఫీసు వద్ద గట్టి పోటీనే ఉండనుంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానుంది. జవవరి 13న వాల్తేరు వీరయ్య వస్తుండడంతో సినీ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించి వారసుడు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా.. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే అందరూ ఈ సంక్రాంతికి మూడు సినిమాల మధ్య కలెక్షన్ల వార్ ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.  

Also Read: Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు ముఖ్యగమనిక.. మరోసారి కీలక మార్పులు  

Also Read: Chittoor Road Accident: డీజిల్ ఆదా చేద్దామని ఆశతో నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News