Miss Shetty Mr Polishetty: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌.. అనుష్క ఏమన్నారంటే?

Ram Charan Review on Naveen Polishetty and Anushka Shetty's Miss Shetty Mr Polishetty Movie Teaser. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌కు అందరూ ఇంప్రెస్‌ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 5, 2023, 02:17 PM IST
Miss Shetty Mr Polishetty: మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌.. అనుష్క ఏమన్నారంటే?

Ram Charan React on Naveen Polishetty and Anushka Shetty's Miss Shetty Mr Polishetty Movie Teaser: టాలీవుడ్ యువ నటుడు న‌వీన్ పొలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబోలో వస్తున్న సినిమా 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ కుమార్ పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో సినీయర్ నటి జయసుధ అనుష్క తల్లిగా, మురళి శర్మ న‌వీన్ తండ్రిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల కానున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది. 

ఇటీవలే విడుదలైన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత కామెడీతో సాగే సినిమా చేస్తున్నారు. మరోవైపు జాతిరత్నాలు సినిమాలో అద్భుత కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేసిన నవీన్‌ పొలిశెట్టి.. ఇందులో కూడా అదే కంటిన్యూ చేశాడు. ఈ సినిమాలో స్టాండప్‌ కమెడియన్‌గా నవీన్.. చీఫ్‌ చెఫ్‌గా అనుష్క చేస్తున్నారు. మరి అనుష్కను ప్రేమలో పడేశాడా? లేదా? అన్నది సినిమాలో చూడాలి. మొత్తంగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటొంది.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి టీజర్‌కు అందరూ ఇంప్రెస్‌ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ రివ్యూ ఇచ్చారు. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా టీజర్‌ చూశాను. చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. టీం సభ్యులకు గుడ్ లక్‌' అని రామ్‌ చరణ్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై హీరోయిన్ అనుష్క శెట్టి స్పందించారు. 'రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌. మీ సతీమణి ఉపాసనతో కలిసి సినిమా చూడండి' అని కోరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రామ్‌ చరణ్‌ ట్వీట్‌పై నవీన్‌ పొలిశెట్టి ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ‘మీ ట్వీట్‌ చూశాను. మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్‌ వేస్తున్నాం. సినిమాల ఎంపికలో మీ నిర్ణయాలతో గేమ్‌ ఛేంజర్‌ అనిపించుకున్నారు. ఇలాంటి విషయాల్లో మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థ్యాంక్యూ’ అని రిప్లై ఇచ్చారు. చరణ్ ట్వీట్‌తో సినిమాపై బజ్‌ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నోనోనోలిరికల్ వీడియో సాంగ్‌ నెట్టింట వైరల్ అయింది. ఇప్పటికే విడుదల అయిన టైటిల్‌, ఫస్ట్ లుక్ సినిమాపై మరిన్ని అంచులను పెంచుతోంది.

అనుష్క శెట్టి చివరిసారిగా ‘నిశ్శబ్దం’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తయ్యింది. చాలాకాలం తర్వాత మళ్లీ మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా? అని అనుష్క ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు నవీన్ పొలిశెట్టి కూడా చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నారు. ‘జాతిరత్నాలు’ సినిమా తర్వాత ఆయన మరో సినిమాలో నటించలేదు. దాంతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!   

Also Read: Supreme Court: ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం, మే 9నే విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News