Kalki 2898 AD Part 2 Update: కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన తాజా వార్తలు మహేష్ బాబు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో ఎలా ఉంటారనే విషయంపై మాట్లాడారు. కొన్ని నెలల క్రితం కల్కి సినిమా ప్రమోషన్ సమయంలో, మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణుడిగా కనిపించడం.. బాగుండదని.. వేరే సినిమాలో అయితే బాగుంటుందని.. కొంచెం హార్స్ గానే నాగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అప్పట్లో..మహేష్ అభిమానులు అశ్విన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, తాజాగా నాగ్ అశ్విన్ తన వ్యాఖ్యలను కొంచెం మారుస్తూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో నటిస్తే, సినిమా రిలీజ్‌కు ముందే సెన్సేషన్ అవుతుంది. ఆయనకు ఉన్న క్రేజ్ సినిమాకు మరింత హైప్ తెస్తుంది," అని ఆయన తెలిపారు. ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రంలోని దేవుడు పాత్ర గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ డైరెక్టర్. "మహేష్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. దేవుడి పాత్రలో ఆయన శ్రద్ధ, అభినయం చూసి అభిమానుల్లో మరింత క్రేజ్ వచ్చింది," అని అన్నారు. నాగ్ అశ్విన్ తాజా వ్యాఖ్యలతో, మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
కానీ నాగ అశ్విన్ ఇంతగా చెబుతున్నా …కల్కి సినిమాలో మాత్రం కృష్ణుడిగా కానీ కల్కిగా కానీ మహేష్ బాబు కనిపించకపోవచ్చనే సమాచారం. దర్శకుడు కొత్త ముఖాలను తీసుకురావాలని భావిస్తున్నారంట. "తెలుసున్న స్టార్ హీరోలు కాకుండా, కొత్త నటులను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నాం," అని అశ్విన్ స్వయంగా తెలుపడం విశేషం.
మరోప మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో నటిస్తే, అది అభిమానులకు గొప్ప కానుకగా మారుతుందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కల్కి మొదటి భాగం లాగానే రెండో భాగం కూడా హై. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రం సినీప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
Also Read: Financial Planning: ఎందుకు గురు టెన్షన్.. ఇలా బడ్జెట్ ప్లాన్‌తో ఎంచక్కా డబ్బులు సేవింగ్ చేసుకోండి
Also Read: Heavy Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం..ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook