AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్

AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌పై స్పష్టత వచ్చింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోటీఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2024, 12:00 PM IST
AP Mega Dsc 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటీఫికేషన్

AP Mega Dsc 2024 Notification: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేసి ఆ మరుసటి రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరగడంతో మరింత జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు.. అయితే అప్పట్నించి నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిస్థితి. మరోవైపు టెట్ పరీక్షలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డీఎస్సీలో ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మరోసారి టెట్ పరీక్ష నిర్వహించింది ప్రభుత్వం. టెట్ పరీక్ష ఫలితాలు నవంబర్ 2న విడుదల కానున్నాయి. టెట్ పరీక్ష ఫలితాలు విడుదలైన మరుసటి రోజే అంటే నవంబర్ 3న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు, సిలబస్ వంటివి https://aptet.apcfss.inలో అందుబాటులో ఉంటాయి. మొత్తం 16,347 పోస్టుల భర్తీకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. 

మెగా డీఎస్సీలో పోస్టుల వివరాలు

మొత్తం పోస్టులు 16,347
సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371
స్కూల్ అసిస్టెంట్లు 7.725
ట్టైన్డ్ గ్రాడ్యుయేట్లు 1781
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286
ప్రిన్సిపల్ పోస్టులు 52
పీఈటీలు 132

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, నిర్వహణలో ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పటిష్టంగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశ్యంలో రెండింటి మధ్య 3 నెలల సమయం ఇస్తున్నారు. డీఎస్సీ సిలబస్ మారిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నోటిపికేషన్ ప్రకారమే సిలబస్ ఉంటుందని తెలిపింది. 

Also read: Flipkart Sales: 108MP కెమేరా, ప్రీమియం ఫీచర్లతో రియల్ మి ఫోన్ కేవలం 13 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News