Niharika - Brahmanandam : నాకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టేనా?.. బ్రహ్మానందంపై మెగా డాటర్ ఫన్నీ కామెంట్స్

Niharika Meets Brahmanandam నిహారిక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అందులో బ్రహ్మానందంతో ఉన్న ఫోటోను, గడిపిన క్షణాల గురించి చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 01:48 PM IST
  • నెట్టింట్లో నిహారిక సందడి
  • బ్రహ్మానందంతో కలిసి చిట్ చాట్
  • రంగమార్తాండ గురించి చెప్పిన మెగా డాటర్
Niharika - Brahmanandam : నాకు కొత్త ఫ్రెండ్ దొరికినట్టేనా?.. బ్రహ్మానందంపై మెగా డాటర్ ఫన్నీ కామెంట్స్

Niharika Konidela Brahmanandam : నిహారిక కొణిదెల తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో బ్రహ్మానందం గురించి, ఆయనతో కలిసి గడిపిన విలువైన సమయం గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అసలే మెగా ఫ్యామిలీకి, బ్రహ్మానందంకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చిరంజీవి బ్రహ్మానందం రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు నిహారిక వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆమె చెప్పిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nihaa Konidela (@niharikakonidela)

బ్రహ్మానందం గారితో కలిసి ఎన్నో మంచి విషయాలను చర్చించాను.. అవును నిజంగానే ఆయన ఎంతో సరదాగా ఉండే వ్యక్తి. నవ్విస్తూనే ఉంటారు. నవ్వించడమే కాకుండా ఎంతో జ్ఞానాన్ని పంచారు.. కథలు ఎంతో బాగా చెప్పారు.. నేటి తరం ఎలా ఉంది.. ఎలా ఆలోచిస్తోందో ఎంతో గొప్పగా చెప్పారు.. ఈ మీటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేశాను.. 

థాంక్స్ అంకుల్.. మీరు చేసిన పనులన్నీ నాకు చెప్పారు.. ఇకపై మిమ్మల్ని తరుచుగా కలుస్తుంటాను.. మంచి విషయాలు నేర్చుకుంటాను.. ఇప్పుడు నాకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికినట్టేగా?.. రంగమార్తాండ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను.. మీకు కచ్చితంగా పండుగలా ఉంటుంది అని నిహారిక చెప్పుకొచ్చింది.

నిహారిక వెబ్ సిరీస్‌లో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉంది. ఇక పబ్ వ్యవహారంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం, దానిపై నాగబాబు ఇచ్చిన వివరణ ఎంత ఫన్నీగా ఉందో ఇలా అందరికీ తెలిసిందే. చివరగా నిహారిక తీసిన హల్ వరల్డ్ వెబ్ సిరీస్ ఓ మోస్తరుగా మెప్పించింది. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ వెబ్ సిరీస్‌తో ఆర్యన్ రాజేష్, నిత్యా శెట్టి వంటి వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చారు.
 

Also Read : Bigg Boss Vasanthi : ఉడుం పట్టుతో సత్తా చాటిన వసంతి.. కన్నీరుపెట్టుకున్న కీర్తి

Also Read : Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News