Rambha Family Pics : హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన రంభ కూతురు.. ఫోటోలు వైరల్

Rambha Daughter Sasha హీరోయిన్ రంభ కూతురు సాషా గత వారం హాస్పిటల్లో ఉన్న సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో సాషా కాస్త తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

  • Nov 08, 2022, 12:19 PM IST
1 /5

హీరోయిన్ రంభ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తుంటుంది. రంభ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. 

2 /5

రంభ ఫ్యామిలీకి జరిగిన కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. గత వారంలో జరిగిన ఈ ప్రమాదంతో రంభ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

3 /5

అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో రంభ పెద్ద కూతురు సాషాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె బెడ్డుపై కదల్లేని స్థితిలోకి వెళ్లింది. తన కూతురి కోసం అందరూ ప్రార్థించండి అని రంభ కోరింది.

4 /5

రంభ పోస్టుపై అనూహ్యమైన స్పందన వచ్చింది. రంభ ఫ్యామిలీ, ఆమె కూతురు క్షేమంగా ఉండాలని సోషల్ మీడియా మొత్తం ప్రార్థనలు చేసింది.

5 /5

రంభ కూతురు ప్రస్తుతం క్షేమంగా ఉంది. ఆమె తన కూతురు ఫోటోలను అందరికీ చూపించింది. తాము క్షేమంగా ఉన్నామని ఇలా తన అభిమానులకు తెలియజేసింది.