Devil Movie: డెవిల్ సినిమాకు ఊహించని బిజినెస్.. కళ్యాణ్ రామ్‌ కెరీర్‌లోనే అత్యధికం..!

Devil Movie Pre Release Business: భారీ అంచనాల నడుమ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. 1940 బ్యాక్ డ్రాప్‌లో బ్రిటీష్ కాలం నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణ్‌ రామ్ కెరీర్‌లో అత్యధికంగా వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 08:08 PM IST
Devil Movie: డెవిల్ సినిమాకు ఊహించని బిజినెస్.. కళ్యాణ్ రామ్‌ కెరీర్‌లోనే అత్యధికం..!

Devil Movie Pre Release Business: డెవిల్‌ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ రేపు (డిసెంబర్ 19) ఆడియన్స్‌ ముందుకు రానుంది. అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తూ.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవాన్ష్ నామా సమర్పణలో తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్‌కు జంటగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్, సత్య, ఎడ్వర్డ్‌ సోన్నెన్‌బ్లిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు. శ్రీకాంత్ విస్సా కథ అందించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ పెంచేసింది. 

1940 బ్యాక్ డ్రాప్‌లో బ్రిటీష్ కాలం నాటి కథతో డెవిల్ మూవీ రూపొందడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. బింబిసార వంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్‌ రామ్.. అమిగోస్‌తో కాస్త నిరాశపరిచాడు. మళ్లీ డెవిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'మాయే చేసి మెల్లగా', దూరమే తీరమై, ది లేడీ రోజ్ సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ హత్య కేసును చేధించేందుకు సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ యాక్ట్ చేస్తుండడంతో ప్రేక్షకులు డెవిల్ మూవీన చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ క్రేజ్‌కు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో డెవిల్ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.5.50 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ.8 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు చెబుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ బిజినెస్‌ భారీ స్థాయిలో జరిగిపోయింది.

ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి రూ.2 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.1.60 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా డేవిల్ మూవీకి మొత్తంగా రూ.20.10 కోట్లు మేర బిజినెస్ అయింది. కళ్యాణ్ రామ్ గత చిత్రాల కంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా జరగడంతో.. డెవిల్ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News