OTT Movies: ఈ వారం ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్, ఏ సినిమా ఏ ఓటీటీలో

OTT Movies: కరోనా సంక్షోభ సమయం నుంచి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో తప్పకుండా విడుదలవుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2023, 01:38 PM IST
OTT Movies: ఈ వారం ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్, ఏ సినిమా ఏ ఓటీటీలో

OTT Movies: ఇంతకుముందు సినిమాలు థియేటర్‌లో మాత్రమే విడుదలయ్యేవి. ఇప్పుడా పరిస్థితి మారింది. ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు డేట్లు ముందే నిర్ణయించేస్తున్నారు. వివిధ రకాల కొత్త, పాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నచ్చిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. 

ఇంటిల్లిపాది హాయిగా నచ్చిన సమయంలో నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన భాషలో చూసేందుకు ఓటీటీలను మించిన ప్రత్యామ్నాయం లేదు.  అందుకే ప్రతి కొత్త సినిమా రోజుల వ్యవధిలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోతుంది. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలైతే కేవలం ఓటీటీల్లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇలా అన్ని భాషల సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనేది బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికగా మారింది. ఈ వారం థియేటర్ రిలీజ్ సినిమాలు పెద్దగా లేవనే చెప్పాలి. సమంత, విజయ దేవరకొండ నటించిన ఖుషి సినిమా ఒక్కటే ఉంది. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓ నెల రోజుల తరువాత ఓటీటీలో విడుదల కావచ్చు. ప్రస్తుతానికి ఈ వారం 22 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో విడుదయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఆగస్టు 29వ తేదన ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ ఇంగ్లీషు మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆగస్టు 30వ తేదీన NCT 127 ది లాస్ట్ బాయ్స్ కొరియన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 1న ది ఫ్రీ లాన్సర్ హిందీ సినిమా విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్

సెప్టెంబర్ 1న ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 ఇంగ్లీషులో స్ట్రీమింగ్ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్

ఆగస్టు 30న స్పానిష్ సినిమా మిస్ అడ్రినల్ ఎ టేల్ ఆఫ్ ట్విన్ స్ట్రీమింగ్‌కు సిద్ఘంగా ఉంది. ఇదే రోజు ఇంగ్లీషు సినిమా లైవ్ టు 100 సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ స్ట్రీమ్ కానుంది. ఆగస్టు 31న ఇంగ్లీషు సినిమా ఛూజ్ విడుదల కానుంది. ఆగస్టు 31న మరో ఇంగ్లీషు సినిమా వన్ పీస్ విడుదలవుతుంది. సెప్టెంబర్ 1న ఇంగ్లీష్ సినిమా డిసెన్ చాంట్‌మెంట్ పార్ట్ 5 విడుదల కానుంది. ఇదే రోజు హిందీ సినిమా ఫ్రైడే నైట్ ప్లాన్ స్ట్రీమ్ అవుతుంది. సెప్టెంబర్ 1న డచ్ సినిమా హ్యాపీ ఎండింగ్ స్ట్రీమ్ కానుంది. ఇదే రోజు సెప్టెంబర్ 1న లవ్ ఈజ్ బ్లైండ్ ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 విడుదలవుతుంది సెప్టెంబర్ 3న జపనీస్ సిరీస్ ఈజ్ షి ద ఊల్ఫ్ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

జీ 5

సెప్టెంబర్ 1న బెంగాలీ సినిమా బియే బిబ్రాత్ , సెప్టెంబర్ 1న తెలుగు డబ్బింగ్ సినిమా డీడీ రిటర్న్స్ స్ట్రీమ్ కానున్నాయి. 

హెచ్‌ఆర్ ఓటీటీ

ఆగస్టు 28న మలయాళం సినిమా నీరజ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 29వ తేదీన మరో మలయాళం సినిమా లవ్ ఫుల్లీ యువర్స్ వేదా స్ట్రీమ్ కానుంది. ఇక ఆగస్టు 30న కూడా మలయాళం సినిమా నానుమ్ పిన్నోరు నానుమ్ సినిమా విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ 20న మరో మలయాళం సినిమా వివాహ ఆహ్వానం స్ట్రీమింగ్ అవనుంది. 

Also read: NTR Rs 100 Coin: ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణెం ఇవాళే విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News