NTR Rs 100 Coin: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల సమయమిది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి అరుదైన గౌరవమిస్తోంది. ఎన్టీ రామారావు ముఖ చిత్రంతో ప్రత్యేక 100 రూపాయల నాణేన్ని ముద్రించింది.
స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెం ఇవాళ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరుకానున్నారు.
దాదాపుగా 200 మంది అతిధులకు ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన నందమూరి తారక రామారావు స్వయంకృషితో సినీ రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థానాన్ని చేరుకుని..ఆ తరువాత తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పార్టీ స్థాపించి అధికారం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇంతకుముందు హైదరాబాద్ వేదికగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరుకాకపోవడంతో అప్పట్లో అతనిపై ట్రోలింగ్ జరిగింది. ఈసారి కూడా హాజరుకాకపోవడంతో మరోసారి ట్రోలింగ్ జరగవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ విడుల చేస్తున్న ఎన్డీఆర్ 100 రూపాయల వెండి నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలిపి ఉంటుంది. ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంటుంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసుంటుంది.
Also read:: Operation Cheetah: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత, మెట్లమార్గం ఇక సురక్షితమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook