Bhanu Sri Voice : భాను శ్రీ గొంతు మీద ట్రోల్స్.. పరువుతీసిన పవిత్ర.. దండం పెట్టిన ప్రదీప్

Super Queen 2 Promo సూపర్ క్వీన్ రెండో సీజన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో విద్యుల్లేఖ, కండక్టర్ ఝాన్సీ, పవిత్ర, గృహలక్ష్మీ లాస్య, సింగర్ మౌనిక యాదవ్ వంటి వారు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మొదటి సీజన్ కంటెస్టెంట్లను సైతం తీసుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2023, 10:12 PM IST
  • బుల్లితెరపై భాను శ్రీ సందడి
  • సూపర్ క్వీన్ ప్రోమో వైరల్
  • భాను శ్రీ వాయిస్‌పై ట్రోలింగ్
Bhanu Sri Voice : భాను శ్రీ గొంతు మీద ట్రోల్స్.. పరువుతీసిన పవిత్ర.. దండం పెట్టిన ప్రదీప్

Super Queen 2 Promo బుల్లితెరపై పవిత్ర, భాను శ్రీ, ప్రదీప్ ఇలా అందరూ సందడి చేస్తుంటారు. ఈ మధ్య అయితే భాను శ్రీ వాయిస్ మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆ మధ్య ఓ సారి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో బిగ్ బాస్ ఫేమ్ భాను పాట పాడిన సంగతి తెలిసిందే. దెబ్బకు సోషల్ మీడియా ఉలిక్కి పడింది. భాను శ్రీ పాడిన పాటకు, ఇంద్రజ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు తలలు పట్టేసుకున్నారు.

గెలుపు తలుపులే తీసే.. అంటూ దారుణమైన గొంతుతో భాను శ్రీ పాట పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటను ఖూనీ చేసిందని అందరూ ట్రోల్స్ చేశారు. ఆ పాటలోని ఫీల్ మొత్తాన్ని చెడగొట్టిందని నెటిజన్లు అంటుంటే.. ఇంద్రజ మాత్రం దారుణమైన జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ పాటలోని డెప్త్ నీ వాయిస్‌లో కనిపించింది అంటూ ఇంద్రజ ఓవర్ యాక్షన్ చేసింది. ఇదంతా ప్రోమోలో కనిపించింది. ఎపిసోడ్‌లో అయితే భాను శ్రీ పాడిన పాటను లేపేశారు. ఇంద్రజ చెప్పిన జడ్జ్మెంట్‌ను కూడా లేపేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News