Oo Antava Song: యూట్యూబ్​ను ఊపేస్తున్న ఊ అంటావా.. ఊఊ అంటావా మావా సాంగ్​!

Oo Antava Song: పుష్ప మూవీ టీమ్​ మరో అప్​డేట్​ ఇచ్చింది. ఊ అంటావా.. ఊ ఊ అంటవా మామా సాంగ్​ను యూట్యూబ్​లో విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 08:08 PM IST
  • పుష్ప మూవీ టీమ్ మరో సర్​ప్రైజ్​
  • యూట్యూబ్​లో ఐటం సాంగ్ విడుదల
  • గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్​
Oo Antava Song: యూట్యూబ్​ను ఊపేస్తున్న ఊ అంటావా.. ఊఊ అంటావా మావా సాంగ్​!

Oo Antava Song: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన  పుష్ప సినిమాలో సాంగ్స్​ (Pushpa movie songs) ఎంత హిట్టయ్యాయో అందరి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్​, అల్లు అర్జున్​, సుకుమార్ కాంబినేషన్ వచ్చిందంటే.. కచ్చితంగా ఆ సినిమాలో ఐటం సాంగ్ ఉండి (Item song in Allu Arjun Movie) తీరాల్సిందే.

ఆర్య సినిమాతో స్టార్ అయిన ఈ ట్రెండ్​.. పుష్ప సినిమా వరకు కొనసాగింది. ఆర్య సినిమాలో 'ఆ అంటే అమలాపురం' సాంగ్​.. ఆర్య-2 సినిమాలో 'రింగ రింగ' సాంగ్ ఓ ఊపు (Ringa Ringa song) ఊపేశాయి.

ఇక పుష్పలోనూ.. 'ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా' పాట తెలుగు రాష్ట్రాల్లో తెగ సందడి చేస్తోంది. మిగతా సాంగ్​లతో పోలిస్తే ఈ పాటకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. సమంత తొలిసారి ఐటం (Samantha Item song) సాంగ్​లో కనిపించడం.

అయితే ఈ పాటకు సంబంధించి మరో బిగ్ అప్​డేట్​ ఇచ్చింది పుష్ప టీమ్. ఇప్పటి వరకు ఆడియో సాంగ్​ను ఎంజాయ్​ చేసిన ప్రేక్షకులకు.. వీడియో సాంగ్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ సాయంత్రం యూట్యూబ్​లో ఈ పాటను విడుదల (Oo Antava Song in You Tube) చేసింది.

యూట్యాబ్​లో విడుదలైన వెంటనే సాంగ్​ను తెగ చూసేస్తున్నారు ప్రేక్షకులు. రెండు గంటల్లో 20 లక్షల వ్యూస్ వచ్చేయంటే (Oo Antava Song in You Tube views) సాంగ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. నేడు రాత్రి 8 గంటల నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ (Pushpa Movie in Amazon prime) అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడ బాషల్లో స్ట్రీమ్​ అవనుంది.

Also read: Bangarraju first review : తండ్రీకొడుకులకు మళ్లీ హిట్.. "బంగార్రాజు" ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్‌ సీన్స్ అద్భుతం

Also read: Aisha Sharma Hot Pics: చలికాలంలోనూ అందాలతో సెగ పుట్టిచ్చేస్తుంది ఈ సుందరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News