Bangarraju first review : తండ్రీకొడుకులకు మళ్లీ హిట్.. "బంగార్రాజు" ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్‌ సీన్స్ అద్భుతం

Bangarraju Movie first review, censor report : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మూవీ బంగార్రాజు మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బంగార్రాజు సినిమా సూపర్‌‌ హిట్ అని చెప్పేశారు. అవే ఈ మూవీకి హైలైట్ అట.

Last Updated : Jan 7, 2022, 07:37 PM IST
  • సంక్రాంతి కానుకగా జనవరి 14న బంగార్రాజు సినిమా రిలీజ్
    ఆరేళ్ల తర్వాత సంక్రాంతి బరిలో నిలిచిన నాగ్ మూవీ
  • సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సూపర్‌‌ హిట్ కొట్టనున్న బంగార్రాజు మూవీ
Bangarraju first review : తండ్రీకొడుకులకు మళ్లీ హిట్.. "బంగార్రాజు" ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్‌ సీన్స్ అద్భుతం

Akkineni Nagarjuna, Naga Chaitanya's Bangarraju Movie first review and censor report : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్‌‌గా తెరకెక్కిన తాజా మూవీ బంగార్రాజు. (Bangarraju Movie) కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగార్జున, నాగ చైతన్యలకు (Naga Chaitanya) జోడీగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. 

ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు.. బంగార్రాజుపై భారీగానే అంచనాలు పెంచేశాయి. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ఐటెం సాంగ్ కూడా అదిరిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో హుషారు, జాంబీ రెడ్డి సినిమాల్లో నటించిన దక్ష నగార్కర్ కూడా మరో స్పెషల్‌ సాంగ్‌లో (Special song) నటించింది. 

నాగార్జున సొంత బ్యానర్‌‌లో నిర్మించిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ (Anoop Rubens) మ్యూజిక్ అందించారు. ఈ సంక్రాంతి బరిలో నుంచి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మూవీలు తప్పుకోవడంతో బంగార్రాజుకి (Bangarraju) కలిసి వస్తుందనే టాక్ వినపడుతోంది. 

2016లో సంక్రాంతి (sankranthi) సందర్భంగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinninayana) మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ అందుకుంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరియర్‌‌లో ఆ చిత్రమే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. కుటుంబ నేపథ్యం ఉన్న మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ (Family Audience) క్యూ కట్టారు. ఇక ఇప్పుడు బంగార్రాజు మూవీకి కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని మూవీ యూనిట్ నమ్మకంతో ఉంది. ఆరేళ్ల తర్వాత మొత్తానికి మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచింది నాగ్ మూవీ. మనం చిత్రం తర్వాత నాగార్జున, నాగ చైతన్యల (Naga Chaitanya) కాంబోలో మళ్లీ మూవీ రావడంతో బంగార్రాజుపై అంచనాలు పెరిగాయి.

Also Read :  AP PRC: ఏపీ ప్రభుత్వం గుడ్​ న్యూస్​- ఉద్యోగులకు పీఆర్​సీ ప్రకటన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News