Radhika Kumaraswamy: మాజీ సీఎం భార్యకు ఝ‌ల‌క్.. పోలీసులకు ఫిర్యాదు

కర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమ‌ణి రాధికా కుమారస్వామి న‌టిగాను, నిర్మాత‌గా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Last Updated : Sep 4, 2020, 01:18 PM IST
Radhika Kumaraswamy: మాజీ సీఎం భార్యకు ఝ‌ల‌క్.. పోలీసులకు ఫిర్యాదు

Radhika Kumaraswamy film  illegally uploaded on youtube: కర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమ‌ణి రాధికా కుమారస్వామి న‌టిగాను, నిర్మాత‌గా పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాటినుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకోని సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. రాధిక 2013లో `స్వీటీ నాన్న జోడీ` అనే క‌న్న‌డ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సైతం రాబట్టింది. అయితే రాధిక కుమారస్వామి రూ. 3 కోట్ల‌తో రూపొందిన ఈ చిత్ర డిజిటల్ హ‌క్కులను ఆమె ఇంకా ఎవ్వ‌రికీ విక్రయించలేదు. ఈ క్రమంలో స్వీటీ నాన్న జోడి సినిమాను రాధికా అనుమ‌తి లేకుండా, హక్కులు పొందకుండా డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న రాధికా సదరు చానల్‌పై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు ఆమె బెంగళూరు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  Also read: Vijayashanti: వారు చనిపోతే.. సుశాంత్ కేసులా దర్యాప్తు జరిగిందా?

అయితే.. రాధికా కుమారస్వామి పెళ్లైన నాటి నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆమె మళ్లీ సినిమాల్లో చురుకుగా మారడంతోపాటు.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Also read: విశాఖపట్నం వచ్చినప్పుడు కలుస్తానమ్మా: పవన్ కల్యాణ్

Trending News