Game Changer HD Print: సంక్రాంతి అంటేనే సినిమా పండగ అనేది తెలిసిన విషయమే. వరస సినిమాలు థియేటర్స్ కోసం కొట్లాడుకొని మరి విడుదలవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ సంక్రాంతికి కూడా మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఒకటి రామ్ చరణ్ కి గేమ్ చేంజెర్ కాగా... మిగతా రెండు..బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి వస్తుండగా మిగతా రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి వచ్చాయి. ఈ క్రమంలో ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఈరోజు జనవరి 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి … మిశ్రమ సొంతం చేసుకుంది.
ఇలాంటి సమయంలో ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటలకే పైరసీకి బలయ్యింది. ఆర్ఆర్ఆర్ తరువాత.. ఎన్నో సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. రామ్ చరణ్ నుంచి వచ్చిన సోలో మూవీగా.. ఈ చిత్రం భారీ అంచనాలను అందుకుంది. కానీ, తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, మూవీ రూల్స్, టెలిగ్రామ్ వంటి టోరెంట్ వెబ్‌సైట్స్‌లో ఫుల్ హెచ్‌డీ వెర్షన్ లీక్ కావడంతో సినీ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ లీక్ వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా తీయడానికి బృందం చేసిన కష్టానికి ఈ పైరసీ.. పెను భూతంలా మారింది అని సోషల్ మీడియాలో సైతం కామెంట్లు పెడుతున్నారు.
మన దేశంలో పైరసీని నిరోధించడానికి కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాపీరైట్ చట్టం ప్రకారం, పైరసీకి పాల్పడిన వారు భారీ జరిమానాలు, శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ వచ్చిన ప్రతి కొత్త సినిమా ఇలా కొన్ని గంటల్లోనే రావడం.. చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. మరి గేమ్ చేంజెర్ సినిమా పైన.. ఈ పైరసీ ప్రభావం ఎక్కువ ఉంటదా..? లేకపోతే సంక్రాంతి సెలవులు కాబట్టి.. థియేటర్స్ కి వచ్చి సినిమా చూడడానికి జనాలు ఇష్టపడతారా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాలి.
శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతిని ఎదురించే ఒక IAS అధికారి కథ. రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు. థమన్ ఎస్ అందించిన సంగీతం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.