Ys Jagan on Tirupati Stampede: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గాయపడివారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడినవారికి కాస్సేపటి క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. తొక్కిసలాట ఎలా జరిగింది, ఆరోగ్యం ఎలా ఉందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాధితులకు వైద్య సహాయం ఎలా అందుతుందో అడిగారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తిరుచానూరు క్రాస్ వద్ద అడ్డుకున్నారు. అరగంట తరువాతే వెళ్లాలని చెప్పడంతో ఆగ్రహించిన వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వదిలి కాలినడకన బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక స్థానిక నేత కారులో తిరుపతి చేరుకున్నారు.
దారిలో కాన్వాయ్‌ను అడ్డుకోవడం ద్వారా బాధితుల్ని పరామర్శించకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే అరగంట ఆగి వెళ్లాలని పోలీసులు సూచించినట్టు తెలిపారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి కూడా కనీసం ట్రాఫిక్ క్లియర్ చేసే పని చేయలేదన్నారు. వైఎస్ జగన్ ఆసుపత్రికి చేరేలోగా బాధితుల్ని అక్కడ్నించి తరలించే ప్రయత్నం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Also read: Tirupati Stampede: తిరుపతి ఘటనలో తప్పెవరిది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో తేడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి