Republic day Special: ఈ రోజు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే!!

ott movies: నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.  మ‌రి ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఓటీటీలో రిలీజ‌వుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఓ  లుక్కేద్దాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 11:58 AM IST
  • నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం
  • ఆహాలో రిలీజ్ అవుతున్న శ్రీవిష్ణు మూవీ
Republic day Special: ఈ రోజు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే!!

Republic day ott releases: ఓ పక్క  దేశమెుత్తం గణతంత్ర వేడుకలకు (Republic Day 2022) సిద్ధమవుతోంది. మరోపక్క  ఓటీటీలో (OTT) రిలీజ్ అయ్యేందుకు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీ అయ్యాయి. విశాల్ నటించిన 'సామాన్యుడు' చిత్రం ఇవాళ థియేటర్ లో సందడి చేయనుంది. మరి ఈ రోజు ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలేంటో ఓ సారి చూసేద్దాం..

ఆహా(AHA)

* అర్జున ఫ‌ల్గుణ‌ (Arjuna Phalguna): శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం 'అర్జున ఫ‌ల్గుణ‌' (Arjuna Phalguna). ‘జోహార్’ ఫేమ్ తేజ మర్ని తెర‌కెక్కించారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. విభిన్నమైన స‌స్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

హాట్‌స్టార్‌ (Hotstar)
* బ్రో డాడీ (మ‌ల‌యాళ చిత్రం)
* దిస్ ఈజ్ అస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)
* ద బుక్ ఆఫ్ బాబా ఫెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)

Also Read: Sarkaru vaari paata First Song: మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'వాలంటైన్స్​ డే'కు 'సర్కారు వారి పాట' తొలి సాంగ్..

జీ5 (ZEE 5)
* ఎల్లం షెరియ‌కుమ్ (మ‌ల‌యాళ చిత్రం)
* ఆహా (మ‌ల‌యాళ చిత్రం)
* ముక్తి ( బెంగాలీ వెబ్ సిరీస్‌)

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)
* ద సిన్న‌ర్ నాల్గో సీజ‌న్‌ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌)

వూట్ సెల‌క్ట్‌ (Voot select)
* బ‌డ‌వ రాస్కెల్ (క‌న్న‌డ సినిమా)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News