Sarkaru vaari paata First Song: మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'వాలంటైన్స్​ డే'కు 'సర్కారు వారి పాట' తొలి సాంగ్..

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేశ్​ 'సర్కారు వారి పాట' సినిమాలోని తొలి గీతం వాలంటైన్స్​ డేకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 08:19 AM IST
  • 'సర్కారు వారి పాట' తొలి సాంగ్
  • ప్రేమికుల రోజున విడుదలయ్యే అవకాశం
Sarkaru vaari paata First Song: మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'వాలంటైన్స్​ డే'కు 'సర్కారు వారి పాట' తొలి సాంగ్..

Sarkaru vaari paata first song: సూపర్ స్టార్ మహేశ్​బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. కీర్తీ సురేశ్ (Keerthy Suresh) కథానాయిక. ఈ సినిమాలోని తొలి పాటను ప్రేమికుల రోజున (Valentine's Day) విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్రబృందం. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.  

ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మహేశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా...కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. మహేశ్ బాబు (Mahesh Babu) మోకాలికి సర్జరీ, ఆ తరువాత మహేశ్, కీర్తి సురేష్‌లు కరోనా బారిన పడటంతో షూటింగ్ కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. సినిమా ప్రమోషన్ కూడా నిలిచిపోయింది. ఈ వేసవికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్కారువారిపాటకు ( Sarkaru vaari paata) సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ అతృతగా ఎదురుచూస్తున్నారు. 

Also read: Neha Sharma Bikini Photos: టూ పీస్ బికినీలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News