RGV: యాంకర్ శ్యామలపై ఆర్జీవీ హాట్ కామెంట్స్, నేను ఓ పెద్ద రాస్కెల్‌ను!

RGV Comments On Anchor Shyamala: యాంకర్ శ్యామలపై.. డైరెక్టర్‌‌ రామ్‌ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్‌ మాములుగా లేవుగా.. వామ్మో ఈ ఆర్జీవీ ఏ ఫిమేల్‌ యాంకర్‌‌ని వదిలేలా లేడు అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 09:19 PM IST
  • మరోసారి హాట్ కామెంట్స్‌ చేసిన డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • యాంకర్‌ శ్యామల అందాన్ని మెచ్చుకుంటూ రొమాంటిక్ కామెంట్స్‌
  • షాక్ అయిన యాంకర్‌‌ శ్యామల
RGV: యాంకర్ శ్యామలపై ఆర్జీవీ హాట్ కామెంట్స్, నేను ఓ పెద్ద రాస్కెల్‌ను!

RGV Comments On Shyamala: సంచనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి హాట్ కామెంట్స్‌ చేసి వార్తల్లోకి ఎక్కారు. వర్మ తాజాగా చేసిన కామెంట్స్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్జీవీ ఇటీవల కాలంలో ఫిమేల్ యాంకర్స్‌లలో చాలా మందిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. 

ఇదేక్రమంలో తాజాగా యాంకర్‌ శ్యామలపై చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. తాజాగా జరిగిన బడవ రాస్కెల్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో... యాంకర్‌‌ శ్యామల అందాన్ని పొగుడుతూ ఆర్జీవీ కామెంట్స్‌ చేశాడు. 

ఇంత అందంగా ఉన్న నువ్వు... నా కళ్లల్లో నుంచి ఇప్పటి వరకు ఎలా తప్పించుకుని తిరుగుతున్నావంటూ శ్యామలను ఉద్దేశించి ఆర్జీవీ అన్నాడు. దీంతో యాంకర్‌‌ శ్యామల ఒక్క క్షణం పాటు ఆర్జీవీని అలాగే చూస్తూ ఉండిపోయింది. 

అయితే అంతకంటే ముందు యాంకర్ శ్యామల.. వర్మ గురించి చెప్తూ.. ఆయన పెద్ద తోపు... రౌడీ... గుండా అంటూ పేర్కొంది. దీంతో రామ్ గోపాల్ వర్మ.. తాను తోపు.. రౌడీ మాత్రమే కాదు.. రాస్కెల్‌ను కూడా అని అన్నారు.

ఇక యాంకర్‌ శ్యామలపై.. వర్మ చేసిన హాట్ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. కాగా పుష్ప‌ మూవీలో జాలిరెడ్డిగా తన విలక్షమైన నటనతో ఆకట్టుకున్న కన్నడ హీరో ధ‌నుంజ‌య్ బ‌డ‌వ రాస్కెల్‌ మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీగా ఇస్తున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.

Also Read: BJP MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు

Also Read: Somu Veerraju: మోదీని తరిమేస్తారా.. బీ కేర్ ఫుల్.. కేసీఆర్‌కు సోము వీర్రాజు వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News