Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...

Hero Nani Dasara Movie Launched: నేచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమా ప్రాజెక్టుకు ఇవాళ క్లాప్ కొట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న 'దసరా' సినిమాను ఇవాళ లాంచ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 05:21 PM IST
  • నాని కొత్త సినిమా దసరా
  • కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో
  • ఇవాళ పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్
  • మార్చి నుంచి రెగ్యులర్ షూట్
Nani Dasara Movie Launched: పట్టాలెక్కిన నాని కొత్త సినిమా 'దసరా'...

Hero Nani Dasara Movie Launched: 'శ్యామ్ సింగరాయ్' సినిమా హిట్టుతో జోష్ మీదున్న నాని మరో కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. 'దసరా' టైటిల్‌తో తెరకెక్కనున్న కొత్త సినిమాకు ఇవాళే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సింగరేణి కోల్‌బెల్ట్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ఓపెనింగ్‌ సందర్భంగా.. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టాడు. దర్శకుడు తిరుమల కిశోర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరికి స్క్రిప్ట్ అందించాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ సంగీతం అందించనున్నారు. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. 

ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 12 ఎకరాల్లో సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌బెల్ట్‌ ప్రాంతాలను తలపించేలా ఈ సెట్ ఉండనున్నట్లు సమాచారం. సెట్ సిద్ధమవగానే చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే.. సుందరానికి' సినిమా షూట్‌లో పాల్గొంటున్నాడు. మలయాళీ భామ నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఎప్పుడైనా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: Tollywood Films: వేసవిలో వినోదపు తుఫాన్.. టాలీవుడ్‌లో వరుసగా విడుదల అవుతున్న పెద్ద సినిమాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News