Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు షాక్-రోడ్ యాక్సిడెంట్ కేసులో త్వరలో చార్జ్‌షీట్

Sai Dharam Tej road accident case: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కేసు మరో తెర పైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 09:29 AM IST
  • సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కేసు మళ్లీ తెర పైకి
  • త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న పోలీసులు
  • నోటీసులకు స్పందించని సాయి ధరమ్ తేజ్
Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు షాక్-రోడ్ యాక్సిడెంట్ కేసులో త్వరలో చార్జ్‌షీట్

Sai Dharam Tej road accident case: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కేసు మరో తెర పైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు తేజ్ స్పందించలేదు. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.

సాయి ధరమ్ తేజ్‌కు 91 సీర్పీసీ కింద నోటీసులు జారీ చేశామని... డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్ల వివరాలు కోరామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే నోటీసులకు తేజ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని... త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయబోతున్నామని వెల్లడించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి (Sai Dharam Tej road accident) గురైన సంగతి తెలిసిందే. బైక్‌పై వెళ్తూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో అదుపు తప్పి పడిపోయాడు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలవడంతో తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితమే పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

సైబరాబాద్ పరిధిలో నేరాల చిట్టా: 

ఇక సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలకు సంబంధించి స్టీఫెన్ రవీంద్ర నివేదిక విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) మృతుల సంఖ్య తగ్గిందన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఇందులో హెల్మెట్ ధరించని కారణంగా 82 శాతం మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. మద్యం మత్తు కారణంగా 212 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో మొత్తం రూ.4.5 కోట్లు జరిమానా వసూలైనట్లు చెప్పారు. 9981 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు.

Also Read: Horoscope Today 28 December 2021: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి పెళ్లి సంబంధం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News