28 December 2021 Horoscope: నేటి రాశి ఫలాలు... ఆ రాశివారికి పెళ్లి సంబంధం ఖాయం..

Horoscope Today, 28 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విధాలా కలిసొస్తుంది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 11:29 AM IST
28 December 2021 Horoscope: నేటి రాశి ఫలాలు... ఆ రాశివారికి పెళ్లి సంబంధం ఖాయం..

Horoscope Today, 28 December 2021: కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విధాలా కలిసొస్తుంది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రతికూలతలు, సానుకూలతలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మేషం : పెళ్లి సంబంధాలకు సానుకూల సమయం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభించే అవకాశం. ఇతరులకు సహాయం చేసేందుకు ముందుంటారు. కొన్ని కారణాలతో ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొంత అదృష్టం కలిసిరావొచ్చు.

వృషభం : వృత్తి వ్యాపారులకు పూర్తి అనుకూల సమయం. వారి వారి రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో కొంత అప్రమత్తత అవసరం. ఆర్థికంగా కలిసిరావొచ్చు. ఆస్తి విలువ పెరిగే ఛాన్స్. పట్టుదలతో ముందుకెళ్తే అనుకున్నది సాధించగలరు. కొందరు వ్యక్తుల సలహాలు మీకు అదృష్టం తీసుకొస్తాయి. కుటుంబం, మిత్రులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి.

మిథునం : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తి అనుకూల సమయం. ఆదాయ విషయంలో ఇబ్బందులు ఉండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీరు చేసే ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా కలిసొస్తుంది. పెళ్లి సంబంధాలకు పూర్తి అనుకూల సమయం. దగ్గరి బంధువుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం. 

కర్కాటకం : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ప్రతికూలత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసొస్తుంది. పెళ్లి సంబంధాలకు అనువైన సమయం. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఆరోగ్య పరంగా కాస్త ఎక్కువ శ్రద్ధ వహించాలి. బంధు మిత్రులతో సంబంధాలు మెరుగువుతాయి.

సింహం : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కలిసొస్తుంది. సంపాదన కొంతమేర పెరుగుతుంది. కొత్త పనులు మొదలుపెట్టేందుకు అనుకూల సమయం. అనుకున్న పనులు కుటుంబ సభ్యులతో కలిసి సకాలంలో పూర్తి చేయగలరు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

కన్య : కుటుంబ సభ్యులు, బంధువులతో కొన్ని విభేదాలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఉద్యోగ పరంగా పూర్తి సానుకూలత ఉంటుంది. ధన లాభంతో పాటు చాలాకాలంగా అనుకుంటున్న పని ఒకటి పూర్తవుతుంది. కుటుంబం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 

తుల : పెళ్లి సంబంధాలకు పూర్తి అనుకూల సమయం. అన్నీ కలిసొస్తే పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. అన్ని విధాలా పలుకుబడి పెరుగుతుంది. కొంత ఆర్థికంగా కలిసొస్తుంది. కొన్ని వృథా ఖర్చులు ఉంటాయి. అద్దె ఇల్లు మారాల్సి రావొచ్చు. ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతత చేకూరుతుంది.

వృశ్చికం: ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనులు సకాలంలో పూర్తవుతాయి. తద్వారా కొంత ప్రశంసలు అందుతాయి. అనుకోని విధంగా ఆదాయం పెరిగే అవకాశం. ఇంటా బయటా కొత్త ఒత్తిడికి గురయ్యే అవకాశం. పెళ్లి సంబంధాల విషయంలో ప్రతికూలత ఉంటుంది. 

ధనుస్సు : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్త వింటారు. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహాయంతో సకాలంలో పనులు పూర్తవుతాయి. కుటుంబ సమస్యలతో కొంత చికాకు కలుగుతుంది. కష్టంలో ఉన్నవారికి కొంత సాయం చేస్తారు. ఉన్నత స్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడవచ్చు. 

మకరం : సంతానం విషయంలో శుభవార్త ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. నిరుద్యోగులకు, వ్యాపారులకు అనుకూల సమయం. బంధుమిత్రులతో పట్టువిడుపులతో ఉండండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంతానం. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. 

కుంభం : కొత్త పనులు చేపడుతారు. అయితే ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలు కొంత బాధ కలిగిస్తాయి. ఆదాయం, సంపాదనలో పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్నేహితుల సహాయంతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. వ్యాపార పరంగా లాభం చేకూరుతుంది.

మీనం : పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది. కొత్త పనులకు పూర్తి సానుకూల సమయం. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.

Also Read: చిన్నారులకు టీకా.. మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం! ఆధార్ లేకుంటే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News