O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

O Antava Song Rehearsal: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'లోని 'ఊ అంటావా మామా..' పాట ఎంతో పాపులర్​ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సాంగ్ లోని సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్​ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం సామ్ చాలా కష్టపడిందట. ఆ పాటకు సంబంధించిన కొన్ని రిహాసల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 07:14 PM IST
O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

O Antava Song Rehearsal: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్​ చేస్తోంది. బన్నీ నటనకు తోడు డైలాగ్స్​ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు. 

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం (ఊ అంటావా మామా..) హైలైట్​గా నిలుస్తోంది. పాటతో పాటు బన్నీతో సమంత చేసిన స్టెప్పులు.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది.

అయితే ఈ పాట కోసం చాలా కష్టపడిందట సామ్. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. 'ఊ అంటావా మామా..' పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. డ్యాన్స్ ప్రాక్టీస్ తో కొరియాగ్రాఫర్ సహాయకుడు తనను ఏడింపిచిటన్లు సరదాగా వ్యాఖ్యనించింది సమంత. 

ఎర్రచందనం స్మగ్లింగ్ కధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇది తొలి భాగం మాత్రమే. 'పుష్ప ది రూల్' పేరుతో రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది.

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్​​ ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. యాంకర్​ అనసూయ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటం సాంగ్​ చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందించారు. నవీన్ యెరనేని. వై. రవి శంకర్​ నిర్మాతలుగా ఉన్నారు.   

Also Read: Anasuya Bharadwaj Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న రంగమ్మత్త- వైరల్ పిక్స్ మీరూ చూసేయండి!

Also Read: Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా అట తన పేరు.. అందానికి సొంతూరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News