ఇర్ఫాన్ ఆకస్మిక మృతిపై స్పందించిన టాలీవుడ్

#RIPIrrfanKhan | ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు #RIPIrrfanKhan స్పందిస్తున్నారు. ఇర్ఫాన్‌ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

Last Updated : Apr 29, 2020, 05:11 PM IST
ఇర్ఫాన్ ఆకస్మిక మృతిపై స్పందించిన టాలీవుడ్

#RIPIrrfanKhan | బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇర్ఫాన్‌ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. నటుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మేరకు పలువురు టాలీవుడ్‌ నటీనటులు, దర్శకనిర్మాతలు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

మహేష్‌ బాబు నటించిన సైనికుడు సినిమాలో నటించి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు నటుడు ఇర్ఫాన్‌. ‘నటుడు ఇర్ఫాన్‌ ఆకస్మిక మరణం తీవ్ర విచారకరం. చాలా తెలివైన నటుడు. ఆయనను చాలా మిస్సవుతున్నాను. ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు ప్రగాడ సానుభూతి తెలుపుతూ’ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు.  Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!

’సినీ ప్రపంచం ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. లెజెండ్‌ లేని స్థానాన్ని భర్తీ చేయలేం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ’ రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు.  Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

’ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇకలేరన్న విషయాన్ని వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయనను కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఓ దిగ్గజాన్ని కోల్పోయామని నిస్సందేహంగా చెప్పవచ్చునంటూ’ దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్పందించారు.

 

దక్షిణాది ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ సైతం స్పందించారు. ‘ఇది చాలా బాధాకరమైన విషయం. సినీ ప్రపంచానికి మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని కచ్చితంగా మిస్సవుతున్నాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలని’ ప్రకాష్‌ రాజ్‌ పోస్ట్‌ చేశారు. 

దర్శకుడు క్రిష్, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్,హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాని, మంచు విష్ణు, మంచు మనోజ్, తదితర టాలీవుడ్ సినీ ప్రముఖులు నటుడు ఇర్ఫాన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిగ్గజ నటుడి సేవలు మరువలేనివని, ఆయన లేని లోటును తీర్చలేమని స్పందిస్తున్నారు.  

  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News