Sankranthi Movies 2024: సంక్రాంతి రేస్ లో బలైపోయిన సినిమా… నాలుగిట్లో అదొక్కటే

Sankranthi Movies Collections: సంక్రాంతి అంటేనే సినీ ప్రేక్షకులకు సంవత్సరం మొత్తానికి పర్ఫెక్ట్ పండుగ. ఎన్నో సినిమాలు ఈ పండగకు విడుదల అవ్వాలని ముచ్చట పడుతూఉంటాయి. ఇదే ఫాలో అవుతూ ఈసారి సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. మరి వాటి పరిస్థితి ఏమిటో చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 12:35 PM IST
Sankranthi Movies 2024: సంక్రాంతి రేస్ లో బలైపోయిన సినిమా… నాలుగిట్లో అదొక్కటే

Guntur Kaaram vs HanuMan: సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో మూడు సినిమాలు స్టార్ హీరోలవి కావడం విశేషం. కానీ అంతకన్నా పెద్ద విశేషమేమిటి అంటే ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టేసి మరీ చిన్న హీరో చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవడం.

ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాల విషయానికి వస్తే జనవరి 18న మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జ హనుమాన్ విడుదల కాగా.. జనవరి 13న వెంకటేష్ సైంధవ్…జనవరి 14న నాగార్జున నా సామిరంగా చిత్రాలు విడుదలయ్యాయి.

ఈ నాలుగు చిత్రాలలో ముందు నుంచి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకోవడంతో అలానే త్రివిక్రమ్ మార్క్ కనిపించకపోవడంతో…ఈ సినిమా సూపర్ హిట్ కి ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. మరో పక్క అదే రోజు రిలీజ్ అయిన హనుమాన్ ప్రస్తుతం ఉన్న సంక్రాంతి సినిమాలలో విన్నర్ గా దూసుకుపోతోంది. 100 కోట్ల క్లబ్ చేరిపోయి 200 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది.

మరోపక్క నాగార్జున నా సామిరంగా కూడా పరవాలేదు అనిపించుకుంటూ ఆ చిత్రానికి తగినన్ని వసూలు తెచ్చుకుంటుంది. అయితే ఈ అన్ని సినిమాల మధ్య నలిగిపోయిన చిత్రం మాత్రం వెంకటేష్ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కావడం మరో విశేషం. సంక్రాంతికి వెంకటేష్ సినిమా అంటే అలానే ఆయన 75వ సినిమా అంటే.. విపరీతంగా ఎదురుచూసేది ఫ్యామిలీ ఆడియన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వెంకటేష్ ఈ లాజిక్ మిస్ అయ్యి ఫ్యామిలీ స్టోరీ కాకుండా ఒక యాక్షన్ సినిమాతో ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. ఈ లాజిక్ మిస్ ఫైర్ అయ్యి నాలుగు సినిమాలలో మరీ డిజాస్టర్ గా మిగిలిపోయింది వెంకటేష్ సైంధవ్ చిత్రం.

హనుమాన్ సూపర్ సక్సెస్ టాక్ తో ప్రభంజనం సృష్టిస్తుండగా.. గుంటూరు కారం, నా సామిరంగ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకుంటున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకటేష్ సైంధవ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా ఏ దశలోనూ పికప్ కాలేదు. ఆఖరికి మొదటి రోజు కూడా ఈ చిత్రం కలెక్షన్స్ సంపాదించలేకపోయింది.  వేరే సినిమాల ఓవర్ ప్లోస్ తో కొంత వరకు నడిచింది కానీ.. అంతిమంగా సినిమా డిజాస్టర్ అని చెప్పాలి. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో సంక్రాంతికి మాస్ సినిమా ఎంచుకోవడం ఒక తప్పైతే.. అలాంటి సినిమా ఎంచుకొని ఎన్ని సినిమాల మధ్య పోటీగా నిలపడం మరో తప్పు.

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News