Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

Shaun Marsh: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ షాన్ మార్ష్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. మెున్న వార్నర్, నిన్న ఫించ్,  ఇవాళ మార్ష్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఆసీసీ కు కోలుకులేని దెబ్బనే చెప్పాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 03:19 PM IST
Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

Shaun Marsh announces retirement: ఆస్ట్రేలియా క్రికెట్‌లో వీడ్కోలు ప‌ర్వం కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా... నిన్న ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా ఆసీస్ స్టార్ బ్యాటర్ షాన్ మార్ష్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచనలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. 23 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో తన చివరి మ్యాచ్ ను జనవరి 17న ఆడబోతున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో మెల్ బోర్న్ రెనెగేడ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మార్ష్ బుధవారం సిడ్నీ థండర్స్ తో జరగబోయే మ్యాచ్ తో క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ సందర్భంగా రెనిగేడ్స్ టీంలో ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపాడు మార్ష్. 

 17 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చిన మార్స్ 40 ఏండ్ల వ‌య‌సులో ఆట‌కు వీడ్కోలు పలకడం విశేషం. 2019లో టెస్టు క్రికెట్ కు, 2023లో వన్డేలకు గుడ్ బై చెప్పిన మార్ష్... అప్పటి నుంచి దేశవాళీ టోర్నీలకే పరిమితమయ్యాడు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ లో తొలిసారి 2008లో కింగ్స్ లెవ‌న్ పంజాబ్ త‌రఫున ఆడిన మార్స్ 616 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మార్ష్ మిగతా ఆటగాళ్ల కంటే తక్కువ మ్యాచ్ లే ఆడాడు. ఇతడు తన కెరీర్ లో 38 టెస్టులు, 73 వ‌న్డేలు, 15 టీ20లు మాత్రమే ఆడాడు. టెస్టుల్లో 2,265 ర‌న్స్, వ‌న్డేల్లో 2,773 ప‌రుగులు, టీ20ల్లో 255 ర‌న్స్ చేశాడు.  బీబీఎల్ 2023-24 సీజ‌న్‌లో ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడిన మార్ష్ ..మూడు హాఫ్ సెంచ‌రీల‌తో 181 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ స్టార్ ప్లేయర్ గా ఉన్న మిచెల్ మార్ష్.. షాన్ మార్ష్ కు సోదరుడు. 

Also Read: IND vs AFG: 14 నెలల తర్వాత టీ20ల్లోకి కోహ్లీ రీఎంట్రీ... భారత్‌, అఫ్గాన్‌ రెండో టీ20 నేడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News