Mangalavaram success celebrations : మహాసముద్రం చేయలేదు.. కానీ ఈ సినిమా చేస్తా : విశ్వక్ సెన్

Mangalavaram: గత శుక్రవారం విడుదలయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరపగా దానికి హాజరైన హీరో విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 09:20 AM IST
Mangalavaram success celebrations : మహాసముద్రం చేయలేదు.. కానీ ఈ సినిమా చేస్తా : విశ్వక్ సెన్

Vishwak Sen: తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి తన రెండవ చిత్రం మహాసముద్రంతో మాత్రం డిజాస్టర్ చవిచూశారు. శర్వానంద్, సిద్ధార్థ లాంటి ఇద్దరు హీరోలను పెట్టినా కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక తన ఆర్ఎక్స్ 100 ఫార్ములా అలానే పాయల్ రాజపుత్ ని నమ్ముకుని ఈ మధ్యనే మంగళవారం అనే చిత్రంతో వచ్చి మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ గెస్టుగా వచ్చాడు. ఈమధ్య తన స్టేజ్ పైన వివాదకరమైన వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయిన ఈ హీరో ఈ సక్సెస్ మీట్ లో ఏంమాట్లాడుతాడని అందరూ ఎదురు చూస్తుండగా..
వివాదకర వ్యాఖ్యలు ఏమి చెయ్యకుండా తన తదుపరి సినిమా గురించి మాత్రం హింట్ ఇచ్చారు.

తన తదుపరిచిన అజయ్ భూపతి తో చేస్తాను అని చెప్పకనే చెప్పాడు విశ్వక్. మహా సముద్రం సినిమాకి కూడా విశ్వక్‌ని అజయ్ అడిగాడట. కానీ డేట్స్ కుదరకపోవడం వల్లే చేయలేదట. అయితే ఇప్పుడు మాత్రం ఈ దర్శకుడితో సినిమా చేస్తాను అంటే మాట ఇచ్చారు.

‘తరుణ్ భాస్కర్ సినిమాలో సెలెక్ట్ అయ్యాక.. నాకు అజయ్ భూపతి ఫోటోలు పంపించామన్నాడని, కానీ అప్పటికే సెలెక్ట్ అయి ఉండటం వల్ల ఫోటోలు పంపించలేకపోయా' అని చెప్పుకొచ్చారు. 

ఇక అజయ్ భూపతి గురించి చెబుతూ..’హీరోయిన్‌ని హీరో చేస్తాడు.. హీరోని మాస్క్ పెట్టి చూపిస్తాడు. మా డైరెక్టర్(తరుణ్ భాస్కర్)తో ఐటం డ్యాన్స్ వేయించాడు.. ఇక నాతో చేయిస్తారు అర్థం కావడం లేదు.. లుంగీ కట్టి, కత్తి పట్టుకునేలా చేయిపించాలి’ అంటూ అజయ్ భూపతికి చెప్పుకొచ్చారు ఈ హీరో. ఇక  హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇలాంటి పాత్ర, ఇలాంటి సినిమా, ఇలాంటి దర్శకుడు దొరకడం అదృష్టం.. అంటూ విశ్వక్ సేన్ తన స్పీచుని ముగించేశాడు.
    
మరోపక్క విశ్వక్ సేన్ స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటే వెనకాల నుంచి మాత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ అలానే యాక్టర్ ప్రియదర్శిలు విపరీతమైన రచ్చ చేస్తూ కనిపించారు. ప్రియదర్శిని కోడుతూ కనిపించారు తరుణ్ భాస్కర్. కాగా గతంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రియదర్శి పెళ్లి చూపుల లోని క్యారెక్టర్ అప్పట్లో ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిన విషయమే. 
మంగళవారం

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News