Suriya Gets Emotional: విజయకాంత్‌ సమాధి వద్ద బోరున విలపించిన హీరో సూర్య, వీడియో వైరల్

Vijayakanth death: గత నెల 28న ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సమాధి వద్ద కెప్టెన్ ను గుర్తు చేసుకుంటూ.. హీరో సూర్య వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 02:34 PM IST
Suriya Gets Emotional: విజయకాంత్‌ సమాధి వద్ద బోరున విలపించిన హీరో సూర్య, వీడియో వైరల్

Suriya Gets Emotional: కోలీవుడ్‌ సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (vijayakanth) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కెప్టెన్ డిసెంబరు 28న చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం యావత్ సినీ ప్రపంచంతోపాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విజయకాంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. 

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కెప్టెన్ కు నివాళులర్పించారు. సూర్య షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉండటంతో చివరి చూపుకు కూడా నోచుకోలేదు. అక్కడ నుంచి తిరగొచ్చిన సూర్య విజయకాంత్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఆయనను తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. సూర్య బోరున విలపిస్తుంటే పక్కనే ఉన్న చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

''విజయకాంత్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది..ఆయన నాకు పెద్దన్నతో సమానం..పెరియన్నా’ సినిమాలో ఆయనతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నా. కెప్టెన్ నన్ను ఎంతో ప్రోత్సాహించేవారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి. ఆయనను కడసారి చూపు నోచుకోకపోవడం నా దురదృష్టం. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు'' అంటూ సూర్య ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సూర్య కంగువా అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి త‌మిళ స్టార్ డైరెక్టర్ శివ‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by actor suriya fan (@suriya__offil)

Also Read: Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌.. ట్రెండింగ్ లో ఫోటోలు..

Also Read:Yatra 2 Teaser : ఆకట్టుకున్న ‘యాత్ర 2’ టీజర్.. మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News