Perfume Title Song: బిగ్‌ బాస్ ఫేమ్ భోలే షావలి చేతుల మీదుగా ‘పర్‌ఫ్యూమ్’ టైటిల్ సాంగ్‌ రిలీజ్

Perfume Movie Release Date: పర్‌ఫ్యూమ్‌ నుంచి టైటిల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా.. జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 24న థియేటర్స్‌లోకి రానుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 08:49 PM IST
Perfume Title Song: బిగ్‌ బాస్ ఫేమ్ భోలే షావలి చేతుల మీదుగా ‘పర్‌ఫ్యూమ్’ టైటిల్ సాంగ్‌ రిలీజ్

Perfume Movie Release Date: చేనాగ్, ప్రాచీ థాకర్ హీరోహీరోయిన్స్‌గా స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్‌‌తో తెరకెక్కిమన మూవీ ‘పర్‌ఫ్యూమ్’. జేడీ స్వామి డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా)లు సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మ్యూజిక్ అందించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు మూవీ మేకర్స్. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ బీట్‌ను విడుదల చేశారు.

పర్‌ఫ్యూమ్ మూవీ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యం అందించారు. నేడు భోలే షావలితో కలిసి భీమ్స్ రిలీజ్ చేశారు. వరం, కీర్తన శర్మ ఆలపించారు. ఈ సాంగ్ ఫుల్ క్రేజీగా కనిపిస్తుండగా.. ఆడియన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. హీరో కారెక్టర్ మీద ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ కథ ఏంటి..? అనేది తెలియాలంటే నవంబర్ 24వ తేదీ వరకు ఆగాల్సిందే. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News