కాలి వేళ్లతో పరీక్ష రాసిన బాలుడు..!

పంజాబ్‌లోని లుథియానాకి చెందిన 11 ఏళ్ల విద్యార్థి కమల్ జీత్ సింగ్ పుట్టుకతోనే నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడడం వల్ల తన అరచేతులు రెండూ పనిచేయడం మానేశాయి. 

Last Updated : Apr 7, 2018, 10:35 PM IST
కాలి వేళ్లతో పరీక్ష రాసిన బాలుడు..!

పంజాబ్‌లోని లుథియానాకి చెందిన 11 ఏళ్ల విద్యార్థి కమల్ జీత్ సింగ్ పుట్టుకతోనే నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడడం వల్ల తన అరచేతులు రెండూ పనిచేయడం మానేశాయి. అయినా చదువంటే పడి చచ్చే ఆ బాలుడు రోజూ స్కూలుకి రాసాగాడు. తన కాలి వేళ్లతో నోట్సు రాయడం ప్రారంభించాడు. తర్వాత అదే అలవాటుగా మారింది. చిత్రమేంటంటే.. పరీక్షలు కూడా అలాగే రాసి.. స్కూలు టాపర్‌ కూడా అయ్యాడు.

కేవలం నోట్సు రాయడం మాత్రమే.. కాలి వేళ్ల సహాయంతో బొమ్మలు కూడా వేయడం ప్రాక్టీసు చేస్తున్నాడు ఆ కుర్రాడు. ప్రస్తుతం  కమల్ జీత్ తన వ్యాధికి సంబంధించి ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడు. ఈ కుర్రాడి పట్టుదల చూస్తే.. తప్పకుండా ఆ వ్యాధి రుగ్మతను కూడా అధిగమించగలడని అంటున్నారు వైద్యులు.

Trending News