AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే

AP New DGP: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. వరుస ఫిర్యాదుల నేపధ్యంలో డీజీపీపై వేటు వేసిన ఈసీ కొత్త డీజీపీను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2024, 10:24 AM IST
AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే

AP New DGP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో వారం రోజులుందనగా ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు కొత్త డీజీపీని దాదాపుగా ఖరారు చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతిపక్షాల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వేటు వేసిన ఎన్నికల సంఘం ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో కొత్త డీజీపీ నియామకానికై ముగ్గురు అధికార్ల పేర్లు ప్రతిపాదించాలని కోరింది. ఈసీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్ ద్వారకా తిరుమలరావు, రోడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను పంపించింది. వీరిలో అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌లు శాంతి భద్రతల విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. 

ఇక 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు సీబీఐలో గతంలో పనిచేశారు. ఇకత రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ సీపీగా, కోస్తాంధ్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పనిచేశారు. ఎలాంటి వివాదాలు లేకపోవడం మరో అర్హతగా ఉంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ద్వారకా తిరుమలరావు పేరును ఏపీ కొత్త డీజీపీగా దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

రాష్ట్రంలో అధికార పార్టీకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే ఐదుగురు ఎస్పీ,లు, ఒక ఐజీ, ఒక సీపీ, ఇంటెలిజెన్స్ ఛీఫ్‌పై వేటు వేసింది. గుంటూరు ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు పడింది. మరోవైపు అనంతపురం ఎస్పీ అన్షు రాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాలను బదిలీ చేసింది. విజయవాడ సీపీని తప్పించి కొత్తగా పీహెచ్‌డి రామకృష్ణను నియమించింది.

Also read: Anchor Syamala: పిఠాపురంలో యాంకర్‌ శ్యామల ప్రచారం.. జై జగన్ అంటూ నినాదాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News