పైరసీ సినిమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న ఫేస్‌బుక్

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ గ్రూపుల్లో పైరసీ సినిమాలను అప్ లోడ్ చేస్తున్నా వాటికి అడ్డుకట్ట వేసే విషయంలో ఎఫ్‌‌బీ యాజమాన్యం ఫెయిల్ అవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. 

Last Updated : Jul 16, 2018, 06:20 PM IST
పైరసీ సినిమాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న ఫేస్‌బుక్

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్ గ్రూపుల్లో పైరసీ సినిమాలను అప్ లోడ్ చేస్తున్నా వాటికి అడ్డుకట్ట వేసే విషయంలో ఎఫ్‌‌బీ యాజమాన్యం ఫెయిల్ అవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాపీ రైట్‌ ఉల్లంఘనకు అడ్డుకట్ట వేసేందుకు ఫేస్‌బుక్ ఉపయోగించే ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదని సమాచారం.

కొన్ని పాత ఫేస్‌బుక్ గ్రూపులు ఇప్పటికీ పైరసీకి ప్రధాన వనరులుగా మారుతూ హాలీవుడ్‌లో విడుదల అవుతున్న ప్రతీ సినిమాను కూడా ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేస్తున్నాయి. అయినా.. ఫేస్‌బుక్ వాటికి సరైన సమయంలో అడ్డుకట్ట వేయకపోవడంతో నిర్మాతలు నివ్వెరపోతున్నారు. నిర్మాతలు మళ్లీ ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని సంప్రదించి ఆయా వీడియోను బ్లాక్ చేయించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందని వారు వాపోతున్నారు. 

ఇదే విషయాన్ని ఫేస్ బుక్‌కు చెందిన ఓ కీలక అధికారి దృష్టికి తీసుకెళ్లగా.. కాపీరైట్ క్లెయిమ్‌కు సంబంధించి పూర్తి సమాచారంతో కూడిన విన్నపం తమకు అందేవరకు ఏంచేయలేమని వారు తెలిపారు. అయితే ఈ పైరసీ సంప్రదాయానికి అడ్డుకట్ట వేసేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని కూడా ఆ అధికారి తెలిపారు. గతంలో పైరసీ వీడియోలను డిలీట్ చేసేందుకు ఫేస్ బుక్ సంస్థ సోర్స్ 3 అనే అమెరికన్ స్టార్టప్ సహాయాన్ని తీసుకుంది.

అలాగే "రైట్స్ మేనేజర్" అనే కొత్త టెక్నాలజీని కూడా ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్ బుక్ అధికారిక సమాచారం ప్రకారం 2017లో చివరి ఆరు నెలల కాలంలో ఆ సంస్థ 2.8 మిలయన్ల పైరసీ కంటెంట్‌ను డిలీట్ చేసిందని చెబుతోంది. అలాగే 3,70,000 మంది కాపీరైటు కంటెంటును క్లెయిమ్ చేస్తూ
ఫేస్ బుక్‌ను సంప్రదించారని కూడా ఆ సంస్థ తెలిపింది. 

Trending News