Jr NTR Bimbisara: కల్యాణ్‌ రామ్ అన్నా.. రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు! బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ

Jr NTR Review about Bimbisara Movie. కల్యాణ్‌ రామ్‌ తమ్ముడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ బింబిసార సినిమాపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 5, 2022, 04:37 PM IST
  • కల్యాణ్‌ రామ్ అన్నా..
  • రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు
  • బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ
Jr NTR Bimbisara: కల్యాణ్‌ రామ్ అన్నా.. రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు! బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ

Jr NTR Review on Kalyan Ram's Bimbisara Movie: నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ఠ రూపొందించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బింబిసార చిత్రంలో కెథరీన్‌ థ్రేసా, సంయుక్త మీనన్‌ హీరోయిన్లుగా నటించారు. రెండేళ్ల గ్యాప్‌ అనంతరం కళ్యాణ్‌ రామ్‌ నటించిన ఈ చిత్రంపై ముందునుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నేడు విడుదలైన బింబిసార సినిమా ఆ అంచనాలను అందుకుని.. మంచి టాక్‌తో దూసుకుపోతోంది. 

బింబిసార సినిమాలో కల్యాణ్‌ రామ్‌ రాజు పాత్రలో నటించారు. కల్యాణ్‌ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. థియేటర్లు అన్ని నందమూరి అభిమానుల గోల, ఈళలతో దద్దరిల్లిపోతున్నాయి. ఇక బింబిసార సినిమాపై సినీ సెలబ్రెటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ తమ్ముడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. తన సోదరుడు కల్యాణ్‌ రామ్‌ అద్భుతంగా నటించాడని, రాజు పాత్రకు కల్యాణ్‌ రామ్‌ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. 

'బింబిసార సినిమా గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నేను చాలా మంచి విషయాలు వింటున్నా. కల్యాణ్‌ రామ్ అన్నా.. బింబిసార సినిమాలో రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు. తొలి సినిమా అయినా వశిష్ఠ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి కీరవాణి గారు వెన్నెముక. స్వరాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ చాలా కష్టపడ్డారు. చిత్రబృందం మొత్తానికి అభినందనలు' అని ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: Special Yog On Monday: ఆగస్టు 8న పుత్రదా ఏకాదశి.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు!

Also Read: Komatireddy Venkat Reddy: బీజేపీ గూటికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..? కమలనాథుల ప్లాన్‌ అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News