Shravana Putrada Ekadashi on 8 August 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతిరోజూ గ్రహాలు మరియు రాశుల కదలిక ఓ వ్యక్తి జీవితంపై పెను ప్రభావం చూపుతాయి. గ్రహాలు, రాశుల కారణంగా వ్యక్తి జీవితంలో మంచి, చెడు జరుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతోన్న శ్రావణ మాసం.. ఈ నెల 11న పౌర్ణమితో ముగుస్తుంది. శ్రావణ మాసం చివరి సోమవారం (ఆగష్టు 8)న పుత్రదా ఏకాదశి ఉపవాసం ఉంది. ఈ రోజున మూడు రాశుల వారికి శుభ యోగాలు జరగనున్నాయి. ఆ రాశులు ఏవో ఓసారి తెలుసుకుందాం.
సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది అన్న విషయం తెలిసిందే. శ్రావణ మాసంలో వచ్చే సోమవారంకు ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో చివరి సోమవారం ఆగస్ట్ 8న వస్తుంది. ఇదే సోమవారంన విష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి కూడా వస్తుంది.ఈ రోజున శుక్ల పక్షపు పుత్రదా ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ రోజున మూడు గ్రహాలు తమ స్వంత రాశిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి.. కొందరికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
ఆగస్టు 8న పుత్రదా ఏకాదశి:
ఈసారి ఆగస్టు 8 చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున శ్రావణ శుక్ల ఏకాదశి కాబట్టి.. పుత్రదా ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి ఉపవాసం అన్ని వ్రతాల్లోకెల్లా అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు.ఈ రోజు ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ రోజున ఉపవాసం చేస్తారు.
శ్రావణ మాసం చివరి సోమవారం:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. శ్రావణ మాసం చివరి సోమవారం ఆగస్టు 8న వస్తుంది. సోమవారం భక్తులు శివుని ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సర్వ దుఃఖములను నశింపజేయువాడుగా శివుడు స్మరించబడుతున్నాడు. ఈ రోజున శివుడిని పూజించడం మరియు ఉపవాసం ఉండడం వల్ల భోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది. దాంతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఆ రాశుల వారికి శుభప్రదం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు 8న గ్రహాల పరంగా కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఆగష్టు 8న మేషం, మకరం, మీన రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష రాశిని పాలించే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు. శని, బృహస్పతి కూడా వారి స్వంత రాశులైన మకరం, మీన రాశులలోకి వస్తారు. ఏ గ్రహం తన రాశిలో ఉందో.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. వీరికి అధిక ధన లాభాలు కూడా కలగనున్నాయి.
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో రచ్చ.. లైవ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ! గొంతు పట్టుకుంటూ..
Also Read: Giant Snake Video: కారును చుట్టేసిన పెద్ద పాము.. ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook